Revanth Reddy: ఎగ్జిట్ పోల్స్ పై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. వాళ్లు మాత్రమే శత్రువులు.. మిగిలినవారంతా మాకు మిత్రులే

శ్రీకాంతాచారి త్యాగానికి ఎన్నికల తేదీకి ఒక లింక్ ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. అప్పట్లో శ్రీకాంతా చారి త్యాగంతో ప్రపంచం ఉలిక్కిపడింది. ఉద్యమంలో ప్రాణత్యాగాలు ఉంటాయని చెప్పి శ్రీకాంతాచారి నిరూపించిండని రేవంత్ రెడ్ది అన్నారు.

Revanth Reddy: ఎగ్జిట్ పోల్స్ పై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. వాళ్లు మాత్రమే శత్రువులు.. మిగిలినవారంతా మాకు మిత్రులే

Revanth Reddy

Telangana Election 2023: తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 3న అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే అని ధీమా వ్యక్తం చేశారు. కామారెడ్డి ప్రజలు కేసీఆర్ ను ఓడించబోతున్నారని, వారికి ధన్యవాదాలు అంటూ రేవంత్ అన్నారు. ప్రజల్లో చైతన్యం వచ్చిందని తేలిపోయిందని రేవంత్ చెప్పారు. అధికారం శాశ్వతమని కేసీఆర్ నమ్మారని రేవంత్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎవరిపైనా కక్షసాధింపు ఉండదని రేవంత్ అన్నారు. తెలంగాణ సమాజానికి మొదటి శత్రువు, చివరి శత్రువు కేసీఆర్ కుటుంబానికి చెందిన ఆ నలుగురేనని రేవంత్ అన్నారు. మిగతా వాళ్లంతా మనవాళ్లేనని రేవంత్ అన్నారు.

Also Read : KTR : ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

మేం మొదటి నుంచి చెప్పిందే నిజమైంది..
ఫలితాలపై కేసీఆర్ మాట్లాడలేదు.. చంద్రుడికి మబ్బులు పట్టాయి.. కబడకుండా పోయారు అంటూ రేవంత్ ఎద్దేవా చేశారు. కేటీఆర్ సర్వేలు చేసిన వారిని భయపెడుతున్నారు. తప్పనితేలితే కేటీఆర్ క్షమాపణ చెబుతారా? అని రేవంత్ ప్రశ్నించారు. ప్రజలను జంతువుల మాదిరి ట్రీట్ చేశారు.. కాంగ్రెస్ శ్రేణులు ఈరోజు నుంచి విజయ సంబరాలు బాధ్యతగా ఉందా. గెలుపు ఓటములు సహజం.. ఓడినవాడు బానిసకాడని రేవంత్ అన్నారు. ప్రతిపక్షాలనుసైతం కాంగ్రెస్ గౌరవిస్తుందని రేవంత్ అన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరిస్తామని, అన్ని వర్గాలు ప్రభుత్వం మాది అన్న విశ్వాసం కల్పిస్తామని చెప్పారు. ఎవరిమీద కాంగ్రెస్ ఆధిపత్యం చెలాయించే పనిచేయదని, మేం పాలకులం కాదు.. సేవకులంలా పనిచేస్తామని రేవంత్ అన్నారు.

Also Read : Telangana Elections 2023 : ఓటు వేసిన మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు

చంద్రుడికి మబ్బులు పట్టాయి..
ఫలితాలపై కేసీఆర్ మాట్లాడలేదు.. చంద్రుడికి మబ్బులు పట్టాయి.. కబడకుండా పోయారు అంటూ రేవంత్ ఎద్దేవా చేశారు. కేటీఆర్ సర్వేలు చేసిన వారిని భయపెడుతున్నారు. తప్పనితేలితే కేటీఆర్ క్షమాపణ చెబుతారా? అని రేవంత్ ప్రశ్నించారు. ప్రజలను జంతువుల మాదిరి ట్రీట్ చేశారు.. కాంగ్రెస్ శ్రేణులు ఈరోజు నుంచి విజయ సంబరాలు బాధ్యతగా ఉందా. గెలుపు ఓటములు సహజం.. ఓడినవాడు బానిసకాడని రేవంత్ అన్నారు. ప్రతిపక్షాలనుసైతం కాంగ్రెస్ గౌరవిస్తుందని రేవంత్ అన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరిస్తామని, అన్ని వర్గాలు ప్రభుత్వం మాది అన్న విశ్వాసం కల్పిస్తామని చెప్పారు. ఎవరిమీద కాంగ్రెస్ ఆధిపత్యం చెలాయించే పనిచేయదని, మేం పాలకులం కాదు.. సేవకులంలా పనిచేస్తామని రేవంత్ అన్నారు.

Also Read : Telangana Election 2023 : మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్.. గతంకంటే ఎక్కువ పోలింగ్ శాతం నమోదు ?

కేటీఆర్ అమెరికా వెళ్లడం ఖాయం..
బీఆర్ఎస్ ను 25సీట్లు దాటనియ్యమని చెప్పాం.. దానికి కట్టుబడి ఉన్నామని రేవంత్ అన్నారు. డిసెంబర్3న ఫలితాల్లో బీఆర్ఎస్ ఓటమి అధికారికంగా వెలువడుతుందని, ఆ తరువాత కేటీఆర్ అమెరికా వెళ్లడం ఖాయమని రేవంత్ అన్నారు. ఇక నుండి బాధ్యతాయుతమైన భాష నా నుంచి ఉంటుందని చెప్పారు. ఈరోజు 6గంటల నుంచి కాంగ్రెస్ పాలక పక్షం.. సీఎల్పీ సమావేశమై అన్ని చర్చించి ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు చేస్తామని రేవంత్ అన్నారు. ఎంఐఎం బీజేపీతో ఉంది.. కేసీఆర్ చెప్పిన విధంగానే ఆ పార్టీ ఉంటుందని, మైనార్టీల యజమాని ఎంఐఎం కాదని, మైనార్టీల సమస్యలు ఎంఐఎం సూచించినా పరిశీలిస్తామని రేవంత్ పేర్కొన్నారు.