KTR : ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

ఎవరూ కన్ ఫ్యూజ్ కావొద్దన్న కేటీఆర్.. వందకు వంద శాతం బీఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

KTR : ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

KTR Sensational Words On Exit Poll Results

ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ కాదు అసలు ఫలితం డిసెంబర్ 3న వస్తుందన్నారు. ఇంకా పోలింగ్ జరుగుతుండగానే, ఓటర్లు క్యూలో ఉండగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల చేయడం కరెక్ట్ కాదన్నారు కేటీఆర్. దీనిపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ఓటర్లను ప్రభావితం చేసే చర్యగా ఆయన అభివర్ణించారు.

డిసెంబర్ 3 తర్వాత తప్పు జరిగిపోయిందని సర్వే సంస్థలు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెబుతారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రానుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 70కి పైగా సీట్లు గెలుస్తామన్నారు. మళ్లీ అధికారం మాదే, హ్యాట్రిక్ కొడతాం అని నమ్మకంగా చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నాన్ సెన్స్, రబ్బిష్ అని తీవ్ర వ్యాఖ్యలతో మండిపడ్డారు కేటీఆర్. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను నమ్మొద్దని పార్టీ కార్యకర్తలకు సూచించాను అన్నారు. ఎవరూ కన్ ఫ్యూజ్ కావొద్దన్న కేటీఆర్.. వందకు వంద శాతం బీఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

2018లో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ తప్పని తేలిన విషయాన్ని గుర్తు చేశారు కేటీఆర్. ఈ తరహా ఎగ్జిట్ పోల్స్ గతంలోనూ చూశామని, మాకు కొత్తేమీ కాదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎగ్జిట్ పోల్స్ చూసి పార్టీ శ్రేణులు కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు. ఓ పక్క పోలింగ్ జరుగుతుంటే.. ఎగ్జిట్ పోల్స్ ఏంటి? అని సీరియస్ అయ్యారు కేటీఆర్. ఎగ్జిట్ పోల్స్ తప్పయితే క్షమాపణలు చెబుతారా? అని సర్వే సంస్థలను నిలదీశారాయన. రేపు ఉదయానికి ఫైనల్ పోల్ పర్సెంటేజ్ వస్తుందని ఆ తర్వాతే కొంత స్పష్టత వస్తుందని కేటీఆర్ చెప్పారు.

Also Read : తెలంగాణలో గెలిచేది ఈ పార్టీనే..! ఎగ్జిట్ పోల్స్ అంచనాలు

”మా కార్యకర్తలు, నాయకులు చాలా కష్టపడ్డారు. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా గంట, గంటన్నర సేపు పోలింగ్ జరిగేది ఉంది. బీఆర్ఎస్ కు 70కి మించి సీట్లు వస్తాయని ఆశిద్దాం. ఎంత పోలింగ్ అయ్యింది. ఏ నియోజకవర్గంలో ఎంత పోలింగ్ శాతం నమోదైంది. ఈ వివరాలన్నీ రేపు ఉదయం వస్తాయి. ఒక్కసారి ఆ ఫిగర్స్ వచ్చాక అప్పుడు అనాలసిస్ చేయొచ్చు” అని కేటీఆర్ అన్నారు.

”ఎగ్జిట్ పోల్స్ చూసి ఆందోళన చెందొద్దు. తెలంగాణలో 2018 ఫలితాలు రిపీట్ అవుతాయి. అప్పుడు కూడా సర్వేలన్నీ ఇలానే చెప్పాయి. డిసెంబర్ 3న మేము అధికారంలోకి వస్తాం. 70కిపైగా సీట్లు వస్తాయి. 88కి పైగా సీట్లు వస్తాయని అనుకున్నా.. కొన్ని చోట్ల తప్పిదాల వల్ల మెజార్టీ కొంచెం తగ్గుతుంది” అని కేటీఆర్ అన్నారు.

Also Read : ఎగ్జిట్ పోల్స్ పై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. వాళ్లు మాత్రమే శత్రువులు.. మిగిలినవారంతా మాకు మిత్రులే