నెమలి పాడె మోస్తూ అంత్యక్రియలు చేసిన అధికారులు: జాతీయపక్షికి గౌరవం

  • Publish Date - June 18, 2020 / 10:21 AM IST

ఈ కరోనా కాలంలో సొంత బంధువులు చనిపోతేనే రక్తసంబంధీకులు..కుటుంబ సభ్యులు సైతం అంత్యక్రియలకు కూడా వెళ్లటంలేదు.అటువంటిది కరెంట్ షాక్ కొట్టి చనిపోయిన నెమలికి ఫారెస్ట్ అధికారులు ఘ‌నంగా అంతిమయాత్ర నిర్వ‌హించారు. 

స్థానికులతో కలిసి నెమలి పాడె కట్టి ఊరేగింపుగా పాడెను మోసుకుంటూ తీసుకెళ్లి ఖననం చేశారు. సంప్రదాయం ప్రకారంగా ఈ అంత్యక్రియలను అధికారులు నిర్వహించిన ఆకస్తిక ఘటన రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో జరిగింది. నెమలి మన జాతీయ పక్షి నెమలి..చనిపోయిన నెమలిని అలా వదిలివేయటం మనస్సు ఒప్పక ఇలా లాంఛనంగా స్వయంగా పాడెను మోసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహిచామని ఓ అధికారి తెలిపారు.  

అటవీ ప్రాంతంలో ఓ నెమలి కరెంట్ షాక్‌తో మరణించింది. ఈ విషయాన్ని స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి వచ్చిన అధికారులు పోసస్టుమార్టం నిర్వహించారు. ఆ తర్వాత శ్మశానవాటికలో హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం దహనం చేశారు. ఈ విషయం తెలిసి స్థానికులు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ పక్షికి ఘనంగా నివాళులు అర్పించారు.