Men are banished from this village on Holi..and only festival for women
Holi 2023 : హోలీ..రంగుల రంగేళీ. భారత్ లో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరుపుకుంటారు. ఎవరు ఎన్ని రకాలుగా జరుపుకున్నా..హోలీ అంటే రంగుల్లో మునిగితేలాల్సిందే. రంగుల హరివిల్లు దివి నుంచి భువికి దిగిందా? అన్నట్లుగా రంగుల్లో మునిగితేలిపోతుంటారు ప్రజలు. ఆడ మగా..చిన్నా పెద్దా అనే తేడా లేకుండా రంగుల పండుగ జరుపుకుంటారు.
అటువంటి రంగుల పండగకు మాత్రం రాజస్థాన్ ( Rajasthan )లోని ఓ గ్రామంలో మగవారు దూరంగా ఉంటారు. హోలీ పండుగ వచ్చిందంటే ఊరు వదిలిపోతారు. చిన్నపిల్లాడి నుంచి వృద్ధుల వరకు హోలీ (Holi) పండుగ రోజున గ్రామంలో ఏ మగపురుగు కూడా ఉండదు. ఊరు వదిలి ఓ దేవాలయంలో ఆరోజంతా గడుపుతారు. ఒకవేళ ఎవరైనా పురుషులు హోలి పండుగ రోజున గ్రామంలో ఉంటే వారికి కొరడా దెబ్బలు తప్పవు. హోలీ పండుగ ఆడే మహిళలకు కన్నెత్తి కూడా చూడకుండా గ్రామంలోని పురుషులు అంతా ఊరు వదిలిపెట్టిపోతారు.
Holi 2023: హోలీ తేదీపై గందరగోళం.. సోషల్ మీడియాలో నెటిజన్ల మీమ్‌ల వర్షం ..
రాజస్థాన్ లోని నగర్ గ్రామంలో 200 ఏళ్లుగా ఈ వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. రాజస్థాన్( Rajasthan)లోని నగర్( Nagar Village ) గ్రామంలో 200 ఏళ్లనుంచి ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. నగర్ గ్రామంలో ఇప్పటికీ పర్దా వ్యవస్థ( purdah system)కొనసాగిస్తున్నారు.హోలీ పండుగ వచ్చిదంటూ గ్రామంలోని ఐదు సంవత్సరాలు పైబడిన పిల్లాడు మొదలు వృద్ధులు వరకు పురుషులు ఎవ్వరు గ్రామంలో ఉండరు. గ్రామానికి మూడు నాలు కిలోమీటర్ల దూరముండే చాముండా మాత దేవాలయంలోకి వెళ్లిపోతారు. అలా మహిళలు అంతా హోలీ ఆటు ముగించుకుని ఇళ్లకు చేరాక మాత్రమే దేవాలయం నుంచి పురుషులు ఇంటికి చేరుకుంటారు. ఒక వేళ పొరపాటునగానీ..కావాలని గానీ ఎవరైనా పురుషులు ఊర్లోకి వస్తే వారిని కొరడా దెబ్బలు కొడతారు.
Holi 2023: హోలీని ఎందుకు జరుపుకుంటారు? ఆ పండుగ ప్రత్యేకత ఏంటీ?
హోలీ పండుగ రోజు మహిళలు గ్రామ కూడళ్లలో రంగుల ఆట ఆడతారు. డ్యాన్సులు చేస్తారు. సంప్రదాయ ఆటపాటలతో ఎంజాయ్ చేస్తారు. వారిని పురుషులు ఎవ్వరూ చూడకూడదు.అందుకే గ్రామం వదలిపోతారు పురుషులంతా. అనారోగ్యంగా ఉన్న పురుషులు మాత్రం గ్రామంలో ఉండొచ్చు. కానీ వారు ఇల్లు వదిలి బయటకు రాకూడదు..హోలీ ఆడే మహిళలను చూడకూడదు. ఈ ఆచారం గత 200 ఏండ్ల నుంచి అమలవుతుందని స్థానికులు తెలిపారు.
Holi 2023: భారతదేశంలో కాకుండా ఏఏ దేశాల్లో హోలీ జరుపుకుంటారో తెలుసా?