Holi 2024: హోలీని ఎందుకు జరుపుకుంటారు? ఆ పండుగ ప్రత్యేకత ఏంటీ?

పురాణాల ప్రకారం చూస్తే... హోలికా అనే రాక్షసి మంటల్లో మాడి మసైపోయిన సందర్భంగా హోలీ జరుపుకుంటారు.

Holi 2024: హోలీని ఎందుకు జరుపుకుంటారు? ఆ పండుగ ప్రత్యేకత ఏంటీ?

Holi

హోలీ పండుగ రంగుల పండుగ.. అదో ఆనంద కేళీ… ప్రజలు ఎంతో ఇష్టంగా కాముడి దహనం, డూండీ, రంగోలీల్లో పాల్గొనే పండుగ. వసంతాగమనంలో వస్తుంది ఈ రంగుల హోలీ. గజగజా వణికించిన చలికి టాటా చెబుతూ.. వేసవి వెచ్చదనంలోకి అడుగుపెడుతున్న వేళ హోలీ వస్తుంది.

వసంత రుతువులోకి కాలం అడుగుపెడుతున్న కొన్ని రోజుల ముందు హోలీ జరుపుకుంటాం. ఆ రుతువుకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతాం. భారతీయ పండుగల్లో హోలీ మరీ ప్రత్యేకం. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు హోలీని ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు. అసలు హోలీని ఎందుకు జరుపుకుంటారు? ఆ పండుగ ప్రత్యేకత ఏంటో చూద్దాం..

పురాణాల ప్రకారం చూస్తే… హోలికా అనే రాక్షసి మంటల్లో మాడి మసైపోయిన సందర్భంగా హోలీ జరుపుకుంటారు. విష్ణు భక్తుడు ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశ్యపుడు. ప్రహ్లాదుడిని చంపడానికి రాక్షసి హోలికా ప్రయత్నిస్తుంది. ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు కావడం, తనని మాత్రమే పూజించాలన్న తన మాట వినకపోవడంతో హిరణ్యకశ్యపుడే తన ప్రహ్లాదుడిని చంపాలని ఆదేశాలు ఇస్తుంటాడు.

ఈ క్రమంలో ప్రహ్లాదుడిని హోలికా మంటల్లో వేస్తుంది. అయితే, ప్రహ్లాదుడిని విష్ణు రక్షిస్తాడు. ఆ మంటల్లో హోలికా పడి కాలిపోతుంది. దీంతో అప్పటి నుంచి ప్రజలు హోలి పండుగను జరుపుకుంటారని హిందువుల నమ్మకం.

హోలీ పండుగ జరుపుకోవడం వెనుక హోలికా దహనం కథ మాత్రమే కాదు మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. శివుడు తపస్సులో ఉంటాడు. ఆ దేవదేవుడికి ఆటంకాలు కలిగించడానికి పూల బాణాలు వేస్తాడు కామదేవుడు. దీంతో శివుడు ఆగ్రహంతో కామదేవుడి శరీరాన్ని నాశనం చేస్తాడు. మూడో కంటిని తెరిచి అతడి శరీరాన్ని కూడా బూడిద చేస్తాడు.

అయితే, తన భర్త కామదేవుడిని బతికించాలని రతీ దేవి ప్రార్థన చేస్తుంది. కరుణామయుడైన శివుడు… చివరకు కామదేవుడికి ఊపిరి ఊదుతాడు. హోలీ ముందురోజు కాముడి దహన వేడుకలు జరుపుకుంటాం.

హోలీ సెల‌బ్రేష‌న్స్‌లో ఇలా చేయొద్దు.. ఐపీఎల్ మ్యాచ్‌లకు మంచినీటిని స‌ర‌ఫ‌రా చేస్తాం: బెంగళూరు సిటీ వాటర్ బోర్డు