ఓటేసిన సూపర్ స్టార్: ఓటేయాలని పిలుపు

  • Publish Date - April 18, 2019 / 02:35 AM IST

రెండవదశ లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు సెలబ్రిటీలు ఉదయమే పోలింగ్ బూత్ ల వద్దకు వచ్చేస్తున్నారు. తమిళనాడులో ఉదయం 7గంటలకే పోలింగ్ ప్రారంభం అవగా సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ చెన్నైలోని స్టెల్లా మేరీ కాలేజీలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెన్నై సెంట్రల్ పార్లమెంటరీ స్థానంలో ఆయన తన ఓటు వాడుకున్నారు.

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్ పోలింగ్‌ కేంద్రం వద్దకు చేరుకోగానే చూసేందుకు అభిమానులంతా ఎగబడ్డారు. పొలిటీషియన్ గా మారిన రజినీకాంత్ లోక్ సభ ఎన్నికలకు మాత్రం దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు కాంగ్రెస్‌ నేత చిదంబంరం తమిళనాడులోని కారైకుడి శివగంగలో తన ఓటు హక్కు వాడుకోగా.. కాంగ్రెస్‌ నేత సుశీల్‌కుమార్‌ షిండే మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఓటు హక్కు వాడుకున్నారు.