Chennai Rain: చెన్నైలో భారీ వర్షాలు.. రజనీకాంత్ ఇంటి చుట్టూ భారీగా చేరిన వరదనీరు.. వీడియో వైరల్

చెన్నైలోని పోయెస్ గార్డెన్ లో రజనీకాంత్ నివాసం ఉంది. ఈ ప్రాంతం హై సెక్యూరిటీ జోన్ పరిధిలోకి వస్తుంది. ఈ ప్రాంతంలో పలు రంగాలకు చెందిన ప్రముఖులు ...

Chennai Rain

Chennai Rains: చెన్నై నగరంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరంలోని పలు రహదారులు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షంపు నీరు చేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంటి చుట్టూ, ఇంటి ఆవరణంలోకి వరద నీరు భారీగా చేరింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో.. రజనీ నివాసం ఇంటి ముందు భారీగా వరదనీరు చేరినట్లు ఉంది. అయితే, ఈ విషయంపై రజనీకాంత్, ఆయన ఇంటి భద్రతా సిబ్బంది ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

Also Read: Omar Abdullah: జమ్మూకశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం.. కేబినెట్‌లో చేరని కాంగ్రెస్.. ఎందుకంటే?

చెన్నైలోని పోయెస్ గార్డెన్ లో రజనీకాంత్ నివాసం ఉంది. ఈ ప్రాంతం హై సెక్యూరిటీ జోన్ పరిధిలోకి వస్తుంది. ఈ ప్రాంతంలో పలు రంగాలకు చెందిన ప్రముఖులు, వ్యాపారవేత్తలు, న్యాయవాదులకు సంబంధించిన విలాసవంతమైన భవనాలు ఉన్నాయి. దీంతో కార్పొరేషన్ అధికారులు అప్రమత్తమై వరద నీటిని పంపింగ్ చేసేందుకు చర్యలు చేపట్టారు.

 

తమిళనాడు వ్యాప్తంగా అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. పలు ప్రాంతాల్లో రహదారులపై భారీగా వరదనీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రతికూల వాతావరణం కారణంగా రైళ్లు, విమాన సర్వీస్సులు, బస్సు సర్వీసులు రద్దయ్యాయి. తమిళనాడు ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.