Kartavya Path: చారిత్రక రాజ్‭పథ్, సెంట్రల్ విస్టా లాన్స్ పేరు మార్చనున్న కేంద్రం

సెప్టెంబరు 7న న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. బ్రిటీష్ సామ్రాజ్యవాద భావజాలాన్ని అద్దంపట్టే ప్రతీ చిహ్నాన్ని కనిపించకుండా చేయడమే తమ లక్ష్యమని ఇటీవల ఆగస్టు 15 ప్రసంగంలో ప్రధాని మోడీ వెల్లడించారు. ఈక్రమంలోనే ప్రధానమంత్రి నివాసం ఉండే ‘రేస్ కోర్స్’ రోడ్డు పేరును ‘లోక్ కల్యాణ్ మార్గ్‭’గా ఇంతకుముందు మార్చారు. ఈ నెల 8వ తేదీన సెంట్రల్ విస్టా ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు

Rajpath and Central Vista lawns in Delhi to be renamed as Kartavya Path

Kartavya Path: చారిత్రక రాజ్‭పథ్, సెంట్రల్ విస్టా లాన్స్ పేరును కేంద్ర ప్రభుత్వం మార్చనున్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో 2047 నాటికి భారత్ సాధించాల్సిన అంశాలపై ప్రధాని మోదీ కొన్ని ప్రమాణాలు చేశారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న రాజ్‭పథ్‭ను ‘కర్తవ్య పథ్‭’గా పేరు మార్చనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. దేశ రాజధానిలో ప్రత్యేకించి పార్లమెంటు పరిధిలో చాలా రోడ్లకు బ్రిటీషర్ల కాలం నాటి పేర్లే ఉన్నాయి. వాటన్నిటినీ పూర్తిగా భారతీయ సంస్కృతిలో భాగం చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ విషయమై చర్చించేందుకు సెప్టెంబరు 7న న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. బ్రిటీష్ సామ్రాజ్యవాద భావజాలాన్ని అద్దంపట్టే ప్రతీ చిహ్నాన్ని కనిపించకుండా చేయడమే తమ లక్ష్యమని ఇటీవల మోదీ చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగా.. కొద్ది రోజుల క్రితమే ప్రధానమంత్రి నివాసం ఉండే ‘రేస్ కోర్స్’ రోడ్డు పేరును ‘లోక్ కల్యాణ్ మార్గ్‭’గా మార్చారు. ఈ నెల 8వ తేదీన సెంట్రల్ విస్టా ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. దీనికి ముందే రాజ్‭పథ్ పేరు మార్పు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Delhi: ప్రారంభానికి సిద్దమైన సెంట్రల్‌ విస్టా అవెన్యూ