Delhi: ప్రారంభానికి సిద్దమైన సెంట్రల్‌ విస్టా అవెన్యూ

ఇండియా గేట్‌ చుట్టు పచ్చదనం ఉండేలా ప్రత్యేక గార్డెన్లు అభివృద్ది చేశారు. మొత్తం సెంట్రల్‌ విస్టాలో మొక్కలు, చెట్ల సంఖ్యను బాగా పెంచారు. 1930లో ఆకాశం నుంచి చూస్తే ఈ ప్రాంతం ఎలా ఉండేదో ఆస్థాయిలో పచ్చదనాన్ని పెంచారు. దీనికి ముందు ఇక్కడ 454 చెట్లు, మొక్కలు మాత్రమే ఉండేవి. రాజ్‌పథ్‌లో ఉన్న ప్రతి చెట్టు ఎత్తు, ఆ చెట్టు లేదా మొక్క రకం, దాని పరిమాణంతో పూర్తి స్థాయిలో జియో టాగింగ్‌ చేశారు

Delhi: ప్రారంభానికి సిద్దమైన సెంట్రల్‌ విస్టా అవెన్యూ

Central Vista Avenue will be soon ready for public use

Delhi: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధమైంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్లు గతంలో మోదీ ప్రభుత్వం ప్రకటించింది. అందుకు అనుగుణంగానే వివిధ మార్పులు చేయడమే కాకుండా నిర్మాణ లక్ష్యాన్ని పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. విజయ్‌ చౌక్‌ నుంచి ఇండియా గేట్‌ వరకు రాజ్‌పథ్‌ ప్రాంతంలో కేంద్రం పలు మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు.

రాజ్‌పథ్‌ మార్గంలో 3,50,000 చదరపు మీటర్ల నుంచి 3,90,000 చదరపు మీటర్లకు లాన్‌ ప్రాంతాన్ని పెంచారు. గణతంత్ర దినోత్సవం సహా జాతీయ కార్యక్రమాల నిర్వహణకు ఎక్కువ ప్రదేశం ఉపయోగించుకునేలా, బహుళ ప్రయోజనాలకు అనుగుణంగా మార్పులు చేశారు. పర్యాటకులను మరింత ఆకర్షించే విధంగా రెడ్‌ స్టోన్‌తో పలు చోట్ల చిన్న చిన్న వంతెనలు, పూల్స్‌ను అభివృద్ది చేశారు. పాదచారులకు అనుకూలంగా రోడ్డు దాటే అవసరం లేకుండా అండర్‌పాస్‌లు, పలుచోట్ల ట్రాన్సిట్‌ ప్లాజా, పార్కింగ్‌ వసతులు ఏర్పాటు చేశారు.

Liz Truss: కాబోయే బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్‭కి అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ

ఇవే కాకుండా ఇండియా గేట్‌ చుట్టు పచ్చదనం ఉండేలా ప్రత్యేక గార్డెన్లు అభివృద్ది చేశారు. మొత్తం సెంట్రల్‌ విస్టాలో మొక్కలు, చెట్ల సంఖ్యను బాగా పెంచారు. 1930లో ఆకాశం నుంచి చూస్తే ఈ ప్రాంతం ఎలా ఉండేదో ఆ స్థాయిలో పచ్చదనాన్ని పెంచారు (దీనికి ముందు ఇక్కడ 454 చెట్లు, మొక్కలు మాత్రమే ఉండేవి). రాజ్‌పథ్‌లో ఉన్న ప్రతి చెట్టు ఎత్తు, ఆ చెట్టు లేదా మొక్క రకం, దాని పరిమాణంతో పూర్తి స్థాయిలో జియో టాగింగ్‌ చేశారు. అన్ని ఏర్పాట్లు పూర్తైన ఈ ప్రాజెక్టును సెప్టెంబర్ 8 సాయంత్రం ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలు పెట్టారు.

కాగా, ఈ కార్యక్రమం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా సజావుగా సాగేందుకు ప్రభుత్వం కొన్ని ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. ఈ విషయమై ఢిల్లీ పోలీసు, సిపిడబ్ల్యూడి అధికారులకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రత్యేక సూచనలు చేసింది. ఆరోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు సెంట్రల్‌ విస్టా పరిసరాల్లోని అన్ని రహదారులు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. విఐపిల సంచారం ఎక్కువగా ఉంటుందని, అనుమతి ఉన్న వాహనాలు మినహా మిగిలిన ఎటువంటి వాటికి అనుమతి ఉండవని స్పష్టం చేశారు. సెంట్రల్‌ విస్టా పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలన్ని సాయంత్రం 4గంటల లోపే కార్యకలాపాలు ముంగించాలని, అవసరమైతే ఇంటి నుంచి పని చేసుకునేలా మార్గదర్శకాలు ఇవ్వాలని అన్ని శాఖలకు ఆదేశాలు పంపారు. వీటితో పాటు అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టాలని ఢిల్లీ పోలీసును డిఓపిటి ఆదేశించింది.

BJP MP Subramanian Swamy: నాడు కమ్యూనిస్టులు, నేడు మోదీ చుట్టూ ఉన్న గూండాలు.. సుబ్రమణ్యస్వామి ఘాటు వ్యాఖ్యలు