Ram Rahim Health : డేరా బాబాకు అస్వస్థత.. రోహ్‌తక్‌ ఆస్పత్రిలో చికిత్స

అత్యాచారం, హత్య కేసుల్లో జైలు జీవితం అనుభవిస్తోన్న డేరా సచ్చా సౌదా సిర్సా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్(Gurmeet Ram Rahim) అస్వస్థతకు గురయ్యారు. 

Ram Rahim Health

Gurmeet Ram Rahim: అత్యాచారం, హత్య కేసుల్లో జైలు జీవితం అనుభవిస్తోన్న డేరా సచ్చా సౌదా సిర్సా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్(Gurmeet Ram Rahim) అస్వస్థతకు గురయ్యారు. డేరా బాబాకు కడుపులో నొప్పిగా ఉండటంతో జైలు అధికారులు ఆయన్ను రోహ్‌తక్‌లోని (PGIMS)లో చేర్పించారు పోలీసులు.

అనంతర ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. సునేరియా జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు 53 ఏళ్ల డేరాబాబా. అతన్ని చికిత్స నిమిత్తం జైలు నుంచి ఆస్పత్రికి తరలించేందుకు భారీ పోలీస్‌ భద్రత ఏర్పాట్లు చేశారు.  వైద్యులు సీటీ స్కాన్ సహా పలు వైద్య పరీక్షలు నిర్వహించారు.

కట్టుదిట్టమైన భద్రత నడుమ మళ్లీ తిరిగి జైలుకు తరలించారు. ఆశ్రమంలోని ఇద్దరు సాద్విల‌పై డేరా బాబా అత్యాచారానికి పాల్పడినట్టు తేలడంతో 2017 ఆగస్టులో సీబీఐ కోర్టు డేరా బాబాకు 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. అప్పటినుంచి గుర్మీత్ రామ్ రోహ్‌తక్‌లోని సునేరియా జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నాడు.