Baba Ramdev
Baba Ramdev : భారతీయ యోగా గురువు రాందేవ్ బాబాకు అరుదైన గౌరవం దక్కింది. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు బొమ్మను ఉంచనున్నారు. ఇది తొలి భారతీయ గురువుకి దక్కిన అరుదైన గౌరవంగా చెప్పుకోవాలి.
London : మేడం టుస్సాడ్స్ మ్యూజియమ్‌లో రణ్‌వీర్ సింగ్ మైనపు బొమ్మ.. ఈ ఫోటోలో అసలు రణ్‌వీర్ ఎవరు?
న్యూయార్క్ లోని మేడమ్ టుస్సాడ్స్‌లో అనేకమంది ప్రముఖుల మైనపు బొమ్మలు ఉంటాయి. అందులో మహాత్మాగాంధీ, మన్మోహన్ సింగ్, ప్రధాని నరేంద్ర మోదీ, సచిన్ టెండూల్కర్, సల్మాన్ ఖాన్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి వారే కాదు బాలీవుడ్ నటులు కూడా ఉన్నారు. ఇప్పుడు యోగా గురువు రాందేవ్ బాబా మైనపు విగ్రహం కూడా మేడమ్ టుస్సాడ్స్ మ్యూజికంలో ప్రదర్శనకు ఉంచుతున్నారు. ఈ అరుదైన గౌరవం దక్కిన భారతీయ యోగా గురువు రాందేవ్ బాబా కావడం విశేషం.
London : మేడం టుస్సాడ్స్ మ్యూజియమ్‌లో రణ్‌వీర్ సింగ్ మైనపు బొమ్మ.. ఈ ఫోటోలో అసలు రణ్‌వీర్ ఎవరు?
న్యూయార్క్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియమ్‌లో ఏర్పాటు చేయబోతున్న రాందేవ్ బాబా మైనపు విగ్రహాన్ని ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాందేవ్ బాబా ఆవిష్కరించారు. ఈ మైనపు బొమ్మను మన్‌హట్టన్ టైమ్ స్క్వేర్‌లోని వ్యాక్స్ మ్యూజియమ్‌లో ఉంచబోతున్నారు. రాందేవ్ బాబా ఆవిష్కరించిన ఆయన మైనపు ప్రతిమ వృక్షాసనంలో తయారు చేశారు. రాందేవ్ బాబా మైనపు విగ్రహాన్ని న్యూయార్క్ తో పాటు ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియమ్‌లో ఉంచబోతున్నట్లు తెలుస్తోంది.
#WATCH | Wax figure of Yog Guru Ramdev unveiled at an event of ‘Madame Tussauds New York’ in Delhi. pic.twitter.com/xFmsUyKWHm
— ANI (@ANI) January 30, 2024