London : మేడం టుస్సాడ్స్ మ్యూజియమ్‌లో రణ్‌వీర్ సింగ్ మైనపు బొమ్మ.. ఈ ఫోటోలో అసలు రణ్‌వీర్ ఎవరు?

మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియమ్‌లో రణ్‌వీర్ సింగ్ రెండు మైనపు విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఆ రెండిటితో రణ్ వీర్ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోలో అసలు రణ్ వీర్ ఎవరు? కనిపెట్టండి.

London : మేడం టుస్సాడ్స్ మ్యూజియమ్‌లో రణ్‌వీర్ సింగ్ మైనపు బొమ్మ.. ఈ ఫోటోలో అసలు రణ్‌వీర్ ఎవరు?

London

Updated On : December 19, 2023 / 1:25 PM IST

London : బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌కి అరుదైన గౌరవం లభించింది. లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో రణ్‌వీర్ మైనపు బొమ్మను ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియమ్‌లో రణ్‌వీర్‌వి ఒకటి కాదు.. రెండు మైనపు బొమ్మలు ఉండటం విశేషం.

Roshan Kanakala : సుమ ముందే హీరోయిన్‌తో రొమాన్స్ చేసిన కొడుకు రోషన్.. చూడలేక చీరతో మొహం కప్పేసుకున్న సుమ..

రణ్‌వీర్ సింగ్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ప్రపంచ వ్యాప్తంగా రణ్‌వీర్‌కి అభిమానులు ఉన్నారు. తాజాగా రణ్‌వీర్ సింగ్‌కి అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే పలువురు ప్రముఖుల మైనపు విగ్రహాలున్న లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియమ్‌లో రణ్‌వీర్ సింగ్ మైనపు విగ్రహాలు ఏర్పాటు చేశారు. అదీ ఒకటి కాదు రెండు. ఈ విషయాన్ని రణ్‌వీర్ సింగ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

రణ్‌వీర్ సింగ్ సోషల్ మీడియాలో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియమ్‌లో తన రెండు మైనపు బొమ్మల పక్కన నిలబడి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అయితే ఈ ఫోటోలో ఉన్న అసలు రణ్‌వీర్ ఎవరు? అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పింక్ జాకెట్ ధరించి, బ్లాక్ ప్రింటెండ్ కోటు, కళ్లకు గాగుల్స్‌తో ముగ్గురు రణ్‌వీర్‌లు ఉన్నట్లు ఫోటో కనిపించింది. వీరిలో కళ్లకు గాగుల్స్‌తో కనిపిస్తున్నది నిజమైన రణ్‌వీర్ .. అటూ ఇటూ ఉన్నవి మైనపు బొమ్మలు. ఇక ఈ ఫోటో చూసాక నెటిజన్లు రణ్‌వీర్ సింగ్ పై శుభాకాంక్షలు కురిపించారు.

తేజ సజ్జ హనుమాన్ ట్రైలర్ వచ్చేసింది.. హనుమంతుడి ఆగమనం అదిరిపోయిందిగా..

రణ్‌వీర్ సింగ్ తన తల్లి అంజు భవ్నానీతో కలిసి మేడమ్ టుస్సాడ్స్‌లోతన మైనపు బొమ్మను ఆవిష్కరించారు. ఎంతోమంది పాపులర్ సెలబ్రిటీల మధ్య తన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషాన్ని కలిగించిందని రణ్‌వీర్ చెప్పారు. మ్యూజియమ్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. రణ్ వీర్ పోస్టుపై ఆయన భార్య నటి దీపిక పదుకొనె సరదాగా స్పందించారు. ‘నాకు ఇప్పుడు ముగ్గురు రణ్‌వీర్‌లు’ అని కామెంట్ పెట్టారు. రణ్‌వీర్ సింగ్ ప్రస్తుతం రోహిత్ శెట్టి ‘సింగం ఎగైన్’ చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజైంది. ఈ మూవీలో దీపా పదుకొనె, అజయ్ దేవగన్, కరీనా కపూర్, అక్షయ్ కుమార్ నటిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh)