తేజ సజ్జ హనుమాన్ ట్రైలర్ వచ్చేసింది.. హనుమంతుడి ఆగమనం అదిరిపోయిందిగా..
ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజవ్వగా హనుమాన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.

Teja Sajja Prasanth Varma Hanuman Movie Trailer Released
Hanuman Trailer : ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా ఇండియన్ సూపర్ హీరో మూవీగా తెరకెక్కిస్తున్న సినిమా హనుమాన్. ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజవ్వగా హనుమాన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాని వరల్డ్ వైడ్ గా శ్రీలంక, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా, స్పెయిన్, జర్మనీ.. ఇలా అనేక కంట్రీస్ లో మొత్తం 11 భాషల్లో రిలీజ్ చేయనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న హనుమాన్ రిలీజ్ కానుంది.
ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా తాజాగా ట్రైలర్ తో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ట్రైలర్ లో.. ఒక పల్లెటూళ్ళో ఉండే తేజ సజ్జకి అసమాన శక్తి సామర్థ్యాలు ఉంటాయి. మరో వైపు ఓ విలన్ దేని కోసమో ఇలాంటి శక్తి సామర్థ్యాలు కావాలని ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. అతనికి హీరో గురించి తెలిసి ఇక్కడికి వచ్చి అతనిపై దాడి చేస్తే హీరోని హనుమంతుడు ఎలా కాపాడాడు ఆ తర్వాత ఏం జరిగింది అనే విధంగా చూపించారు. ఇక ట్రైలర్ లో షాట్స్, VFX అదిరిపోయాయి. సినిమా మొత్తం చూస్తే ఇంకే రేంజ్ లో ఉంటాయో.
ఇక హనుమాన్ సినిమా నుంచి ఓ పాత రిలీజ్ చేయగా అది కూడా వైరల్ అయింది. ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా, వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తుంది. సంక్రాంతికి భారీ సినిమాల మధ్య ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అలాగే హనుమాన్ సినిమా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఉంటుందని తెలుస్తుంది.