Roshan Kanakala : సుమ ముందే హీరోయిన్‌తో రొమాన్స్ చేసిన కొడుకు రోషన్.. చూడలేక చీరతో మొహం కప్పేసుకున్న సుమ..
సుమ అడ్డా షో 50వ ఎపిసోడ్ కి బబుల్ గమ్ మూవీ యూనిట్ తో పాటు రాజీవ్ కనకాల కూడా వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా ఆద్యంతం ఫుల్ గా ఎంటర్టైన్ చేశారు సుమ ఫ్యామిలీ.

Roshan Kanakala and Manasa Choudhary Performance Before Suma Kanakala in Suma Adda Show
Roshan Kanakala : యాంకర్ సుమ(Suma Kanakala) తనయుడు రోషన్ కనకాల హీరోగా రాబోతున్న సంగతి తెలిసిందే. రవికాంత్ పేరెపు దర్శకత్వంలో రోషన్ కనకాల, మానస చౌదరి జంటగా తెరకెక్కిన సినిమా ‘బబుల్ గమ్’. ఈ సినిమా డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్, టీజర్స్ తో సినిమాపై ఆసక్తి కలిగించారు. మొదటి సినిమాలోనే ముద్దులు, రొమాన్స్ తో రోషన్ రెచ్చిపోయినట్టు ట్రైలర్ లో చూపించారు.
ప్రస్తుతం బబుల్ గమ్ చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ మూవీ యూనిట్ సుమ అడ్డా(Suma Adda) షోకి వచ్చారు. సుమ అడ్డా షో 50వ ఎపిసోడ్ కి ఈ మూవీ యూనిట్ తో పాటు రాజీవ్ కనకాల కూడా వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా ఆద్యంతం ఫుల్ గా ఎంటర్టైన్ చేశారు సుమ ఫ్యామిలీ. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది.
Also Read : సూపర్ సింగర్ కొత్త సీజన్ ప్రోమో వచ్చేసింది.. కొత్త జడ్జీలు ఎవరో తెలుసా? అదరగొడుతున్న సింగర్లు..
సుమ ముందే రోషన్, రాజీవ్ డ్యాన్సులు చేశారు. అలాగే ఉప్పెన సాంగ్ కి రోషన్, హీరోయిన్ మానస తో రొమాంటిక్ గా చేస్తుంటే సుమ చూడలేక మొహం చీరతో కప్పేసుకుంది. ఆ తర్వాత సినిమాలోని డైలాగ్ చెప్తూ హీరోయిన్ కి ముద్దు పెడతాను అని సుమ ముందే చెప్పాడు రోషన్. ఇక కాసేపు రాజీవ్ సుమని నవ్వించాడు. దీంతో ప్రోమోనే ఇంత ఎంటర్టైన్మెంట్ ఉంటే, ఎపిసోడ్ లో ఏ రేంజ్ ఉందో అని ప్రేక్షకులు ఫుల్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారు.