Super Singer 2023 : సూపర్ సింగర్ కొత్త సీజన్ ప్రోమో వచ్చేసింది.. కొత్త జడ్జీలు ఎవరో తెలుసా? అదరగొడుతున్న సింగర్లు..
కొత్త కొత్త సింగర్స్ ని పరిచయం చేసే సూపర్ సింగర్ షో కొత్త సీజన్ మొదలవ్వనుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు.

Sreemukhi Hosting Super Singer 2023 New Season Promo Released
Super Singer 2023 : కొత్త కొత్త సింగర్స్ ని పరిచయం చేసే సూపర్ సింగర్ షో కొత్త సీజన్ మొదలవ్వనుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. ఈ సారి జడ్జీలుగా అనంత్ శ్రీరామ్, మంగ్లీ, శ్వేతా మోహన్, రాహుల్ సిప్లిగంజ్ లు ఉండగా శ్రీముఖి(Sreemukhi) షో హోస్ట్ చేయనుంది. ఆడిషన్స్ చేసి షో కోసం 20 మంది బెస్ట్ సింగర్స్ ని దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చారు. వీరిని అనంత్ వారియర్స్, శ్వేతా రాక్ స్టార్స్, మంగ్లీ బ్లాస్టర్స్, రాహుల్ చిచ్చాస్ అంటూ నాలుగు టీమ్స్ గా విడగొట్టారు.
మరి ఈ 20 మంది సింగర్స్ తమ పాటలతో ఈ సీజన్ ప్రేక్షకులని ఎలా మెప్పిస్తారో, ఈ సీజన్ లో ఎన్ని ఎమోషనల్, కామెడీ మూమెంట్స్ ఉంటాయో, ఈ సీజన్ ఎవరు టైటిల్ విన్నర్ అవుతారో చూడాలి. ఇక ఈ షో డిసెంబర్ 23 నుంచి ప్రతి శని, ఆదివారాలు రాత్రి 9 గంటలకు స్టార్ మా లో రానుంది.
Also Read : Sitara Ghattamaneni : మహేష్ కూతురు సితార పాప క్రిస్మస్ సెలబ్రేషన్స్ చూశారా?