కలెక్టర్‌పై అత్యాచారం కేసు : ప్రభుత్వ ఉద్యోగి భార్యను బెదిరించి అత్యాచారం చేసినట్లుగా ఫిర్యాదు

  • Publish Date - June 4, 2020 / 04:46 AM IST

నేను చెప్పిన మాట విని నా కోరిక తీర్చకపోతే..నీ భర్తని ఉద్యోగంలోంచి  తీసేస్తానని బెదిరించి ఓ ఉద్యోగి భార్యపై అత్యాచారం చేశాడని  మాజీ కలెక్టర్పై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన ఛత్తీస్ గఢ్ లో కలకలం రేపింది. 

తన కోరిక తీర్చకపోతే తన భర్తను ఉద్యోగం నుంచి తీసేస్తానని జంజ్‌గిర్‌-చంపా జిల్లా కలెక్టర్‌ గా పనిచేసిన జేకే పాతక్‌ తనను బెదిరించి కలెక్టర్ ఆఫీసులోనే   మే 15న తనపై అత్యాచారం చేశాడని  33 ఏళ్ల మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

తన భర్త ప్రభుత్వ ఉద్యోగి..తాను చెప్పినట్లుగా వినకుంటే నీ భర్తను డిస్మిస్ చేస్తానని బెదిరించాడని..దానికి తాను ఎంతగా బతిమిలాడినా వినకుండా తనపై కలెక్టర్ ఆఫీసులోనే అత్యాచారం చేశాడని తెలిపింది. గతంతో అతని నుంచి తనకు చాలా అశ్లీల వీడియోలు..ఫోటోలు కూడా వచ్చాయని చెబుతూ..దానికి సంబంధించి స్ర్కీన్ షాట్స్ ను కూడా పోలీసులకు చూపించింది. 

దీనిపై ఎస్పీ పరుల్‌ మథూర్‌  మాట్లాడుతూ..ఆమె చూపింన ఆధారాల ప్రకారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని తెలిపారు. మహిళ నుంచి పూర్తిస్థాయిలో స్టేట్‌మెంట్‌ను తీసుకున్నామని..ఆమె మొబైల్‌ రికార్డ్స్‌ను పరిశీలించినట్లు తెలిపారు. నిందితుడిపై ఐపీసీ సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. కేసు దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.సదరు నిందితుడిపై ఐపీసీ 376,506,309బీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు. కాగా జనక్ ప్రసాద్ మే 27న ల్ాయండ్ రికార్డ్స్ కమిషనర్ గా ట్రాన్స్ ఫర్ అయ్యారు. ఇప్పటి వరకూ అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. 

Read: భర్త రెండో పెళ్లి..అప్పుడే సీన్ లోకి మొదటి భార్య..తర్వాత