Site icon 10TV Telugu

Black Panther : మధ్యప్రదేశ్ అడవుల్లో అరుదైన నల్ల చిరుత-వైరల్ వీడియో

black panther

black panther

Black Panther :  మధ్యప్రదేశ్ అడవుల్లో అరుదైన నల్ల చిరుత కనిపించింది. దీంతో వన్యప్రాణి ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా వన్యప్రాణి ప్రేమికులు అరుదైన జంతువులను, పక్షులను చూడటంలో ఆనందం పొందుతుంటారు. అందుకోసం వివిధ అడవుల్లో సఫారీకి వెళుతుంటారు.

మధ్యప్రదేశ్ లోని   పెంచ్ నేషనల్ పార్క్ లో   సఫారీకి వెళ్లిన టూరిస్టులు బ్లాక్ పాంథర్ ను చూసే అదృష్ట దక్కడంతో ఆనందంలో మునిగిపోయారు. అందుకు సంబంధించిన వీడియో పెంచ్ టైగర్ రిజర్వ్   ట్విట్టర్ హ్యాండిల్ లో వైరల్ అవుతోంది.

అడవుల్లో కొన్ని అరుదైన జంతువులు కనిపించాలంటే కొన్ని నెలలు, ఏళ్లు పడుతుంది.   బ్లాక్ పాంథర్ రోడ్డు దాటుతున్నప్పుడు రోడ్డుకు అవతలి వైపు కొన్ని కార్లు ఆగి ఉండటం వీడియోలో చూడవచ్చు. రోడ్డుకు ఇవతలివైపు ఉన్న వారు  ఆ వీడియో తీశారు.  ఇప్పటి వరకు ఈ వీడియోను 19 వేల మందికి పైగా వీక్షించారు. 1100 లైక్ లు వచ్చాయి. పలువురు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు కూడా చేశారు. మీరూ ఆ బ్లాక్ పాంథర్ ను ఒక లుక్కేయండి..

Exit mobile version