Air India Flight: ఎయిర్ ఇండియా విమానంలో ఎలుక ప్రత్యక్షం: 2 గంటలు ఆలస్యంగా విమానం

ఎయిర్ ఇండియా విమానంలో ఎలుక ప్రత్యక్షమవగా కాసేపు విమానంలో గందగోళం ఏర్పడింది. ఈఘటన గురువారం జమ్మూకాశ్మీర్ లో చోటుచేసుకుంది

Air India

Air India Flight: సరిగ్గా టేక్ ఆఫ్ అయ్యే సమయానికి విమానంలో ఎలుక ప్రత్యక్షమవడం ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఎయిర్ ఇండియా విమానంలో ఎలుక ప్రత్యక్షమవగా కాసేపు విమానంలో గందగోళం ఏర్పడింది. ఈఘటన గురువారం జమ్మూకాశ్మీర్ లో చోటుచేసుకుంది. శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ నుంచి గురువారం మధ్యాహ్నం 2:15 గంటలకు బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా AI822 విమానంలో ఎలుక కనిపించింది. విమాన సిబ్బంది సమాచారంతో రంగంలోకి దిగిన ఎయిర్ పోర్ట్ సిబ్బంది ఎలుకను బందించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం రెండు గంటల ఆలస్యంగా సాయంత్రం 4.10 గంటలకు విమానం తిరిగి టేక్ ఆఫ్ అయింది.

Also read:CM kejriwal : క‌ర్ణాట‌క‌లోనూ పోటీ చేస్తాం.. విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం :కేజ్రీవాల్

అయితే ఈఘటనపై డీజీసీఏ అధికారులు విచారణకు ఆదేశించారు. ఈవ్యహారంపై మీడియా వివరణకు స్పందించేందుకు ఎయిర్ ఇండియా ప్రతినిధులు సుముఖత చూపలేదు. తీవ్ర నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ 2022 జనవరిలో కేంద్ర ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసింది. ప్రయాణికులకు అత్యుత్తమ సేవలు అందించడమే లక్ష్యంగా ఎయిర్ ఇండియాను తీర్చిదిద్దుతామని సంస్థ చైర్మన్ చంద్రశేఖరన్ వెల్లడించారు.

Also read:IIT-Madras Covid-19 : ఐఐటీ మద్రాసులో కరోనా కలకలం.. 19మంది విద్యార్థులకు పాజిటివ్..