CM kejriwal : కర్ణాటకలోనూ పోటీ చేస్తాం.. విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం :కేజ్రీవాల్
కర్ణాటకలనూ పోటీ చేస్తాం.. విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అంటూ ధీమా వ్యక్తం చేశారు ఆప్ చీఫ్..సీఎం అరవింద్ కేజ్రీవాల్.

Aap Will Form Its Next Government In Karnataka
AAP Will Form Its Next Government In Karnataka say CM kejriwal : ఢిల్లీలో ప్రారంభమైన ఆప్ పార్టీ విజయకేతనం పంజాబ్ లో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి చేరుకుంది. ఇప్పటికే జాతీయ పార్టీగా అవరించిన ఆప్ పార్టీ కన్ను కర్ణాటకపై కూడా పడింది. కర్ణాటకలో కూడా పోటీ చేసి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తంచేస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేస్తూ.. కర్ణాటకలోనూ ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. గురువారం (ఏప్రిల్ 21,2022) కర్ణాటక రాజధాని బెంగళూరు పర్యటనకు వెళ్లిన కేజ్రీవాల్… కర్ణాటక రాష్ట్ర రైతులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ..‘‘ఢిల్లీ, పంజాబ్ లలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లుగానే కర్ణాటకలోనూ తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేజ్రీవాల్ ప్రకటించారు. ప్రజలకు స్కూల్స్, ఆసుపత్రులు, ఉచిత విద్యుత్, ఉచిత రవాణా, ఉచిత నీరు కావాలంటే.. ఆప్‌కి ఓటు వేయాలని బెంగళూరులో జరిగిన రైతు ర్యాలీలో అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా రైతు ఉద్యమ నేత కోడిహళ్లి చంద్రశేఖర్ ఆప్‌లో చేరారు. ఆయనకు కేజ్రీవాల్ పార్టీ కండువా కప్పి ఆప్‌లోకి సాదరంగా ఆహ్వానించారు. కేజ్రీవాల్ బెంగళూరు సభకు భారీ సంఖ్యలో రైతులు హాజరయ్యారు. ఆప్ కు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అవినీతికి వ్యతిరేకంగా చట్టం చేయాలని డిమాండ్ చేసినప్పుడు తాము.. సామాన్య ప్రజలు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చామని ఈ సందర్భంగా కేజ్రీవాల్ గుర్తు చేశారు. తరువాత తాము రాజకీయ పార్టీని ఏర్పాటు చేసాము. మా మొదటి ప్రభుత్వం ఢిల్లీలోను..తరువాత పంజాబ్‌లో ఏర్పాటు చేశామని తెలిపిన కేజ్రీవాల్ ఆప్ రానున్న ఎన్నికల్లో కర్ణాటకలో పోటీ చేసి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు.