Ratan Tata
Ratan Tata : వర్షాకాలంలో రోడ్లపై తిరిగే జనాలకే కాదు.. జంతువులకు రక్షణ ఉండాలని ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా సూచిస్తున్నారు. ముఖ్యంగా కార్ల కింద ఏ జంతువు లేదని నిర్ధారించుకున్నాకే డ్రైవింగ్ చేయమని సలహా ఇస్తున్నారు. వర్షాకాలంలో వీధుల్లో కుక్కలు, పిల్లులకు మనుష్యుల వల్ల ఎదురయ్యే ప్రమాదాల గురించి రతన్ టాటా సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.
వర్షం నుంచి కాపాడుకోవడం కోసం సరైన చోటు లేక కుక్కలు, పిల్లులు ఇళ్ళ ముందు నిలిపిన వాహనాల క్రింద చేరతాయి. ఒక్కోసారి అక్కడే నిద్రపోతుంటాయి. ఏ మాత్రం వాటిని గమనించకుండా వాటి మీద నుంచి డ్రైవ్ చేసినా వాటి ప్రాణాలు పోతాయి. వాటికి అలాంటి పరిస్థితి రాకుండా కారు డ్రైవ్ చేయడానికి ముందు ఒకసారి చెక్ చేసుకోవాల్సిందిగా పారిశ్రామిక వేత్త రతన్ టాటా సూచిస్తున్నారు. ఈ సీజన్ లో వర్షం కురిసనపుడు వాటికి మనం తాత్కాలికంగా ఆశ్రయం కల్పిస్తే వాటికి మంచి చేసినట్లు అవుతుందని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో (@RNTata2000) పేర్కొన్నారు. రతన్ టాటా ట్వీట్‌పై జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Stay Fit During Monsoons : వర్షాకాలంలో ఫిట్‌గా ఉండేందుకు సహాయపడే ఆహారపు అలవాట్లు ఇవే !
‘మీ సూచన మనసుకి నచ్చింది. జంతువుల పట్ల కరుణను ప్రోత్సహిస్తోంది’ అని ఒకరు..’మీలాంటి గొప్ప వ్యక్తులకు మాత్రమే ఇలాంటి మంచి ఆలోచనలు వస్తాయని’ మరొకరు వరుసగా అభిప్రాయాలు చెప్పారు. భారీ వర్షాల్లో అనేక జంతువులు ఫుట్ పాత్ లపై తడుస్తూ కనిపిస్తుంటాయి. కొన్ని వాన నీటి ప్రవాహంలో కొట్టుకుపోతూ కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితి నుంచి తమను తాము కాపాడుకునేందుకు ఆగి ఉన్న వాహనాల క్రింద ఆశ్రయం పొందుతాయి. మనుష్యులు అది గమనించకుండా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్ల చనిపోతుంటాయి. వాటికి అలాంటి పరిస్థితి రానీయకండి అంటూ రతన్ టాటా చేసి సూచనను అందరూ ప్రశంసిస్తున్నారు. ఆయన సూచన అందరూ పాటిస్తే మూగజీవాలను కాపాడిన వారమవుతాం.
Now that the monsoons are here, a lot of stray cats and dogs take shelter under our cars. It is important to check under our car before we turn it on and accelerate to avoid injuries to stray animals taking shelter. They can be seriously injured, handicapped and even killed if we… pic.twitter.com/BH4iHJJyhp
— Ratan N. Tata (@RNTata2000) July 4, 2023