ratan tata
Ratan Tata Passed Away: దిగ్గజ పారిశ్రామిక వేత్త, పద్మ విభూషణ్ గ్రహీత, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (86) కన్నుమూశారు. దేశంలోని అత్యంత గౌరవనీయమైన వ్యాపారవేత్తల్లో రతన్ టాటా ఒకరు. రతన్ టాటా తన చేపట్టిన అనేక సేవా కార్యక్రమాల ద్వారా ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు. టాటా ట్రస్ట్ ద్వారా విద్య, ఆరోగ్య సంరక్షణ, విపత్తుల సమయంలో సహాయసహకారాలు అందించారు. రతన్ టాటా పెళ్లి చేసుకోలేదనే విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన మరణం తరువాత ఆయన వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు ఎవరనే చర్చ జరుగుతుంది.
Also Read: శంతను నాయుడు ఎవరు.. రతన్ టాటాతో అతనికున్న బంధం ఏమిటి.. వారిని కలిపింది ఎవరో తెలుసా?
రతన్ టాటా తల్లిదండ్రుల పేర్లు నావల్ టాటా, సోనీ. వీరు 1940లో విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత నావల్ టాటా 1955లో స్వీస్ మహిళ సిమోన్ ను వివాహం చేసుకున్నాడు. వారికి నోయెల్ టాటా అనే కుమారుడు ఉన్నాడు. నోయెల్ టాటాకు మాయ టాటా, నెవిల్లే టాటా, లియా టాటా ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారు ప్రస్తుతం టాటా గ్రూప్ వ్యాపారాల్లో ఉన్నత స్థాయిల్లో ఉన్నారు. వీరిలో రతన్ టాటా వారసులుగా ఎవరు ఉండబోతున్నారనే చర్చ జరుగుతుంది.
లియో టాటా (39 సంవత్సరాలు).. స్పెయిన్ లోని ఐఈ బిజినెస్ స్కూల్ నుండి మార్కెటింగ్ లో మాస్టర్స్ డిగ్రీ పొందాడు. 2006లో తాజ్ హోటల్స్ రిసార్ట్స్, ప్యాలెస్ లో పనిచేసింది. ఇప్పుడు ఇండియన్ హోటల్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్సీఎల్) లో వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు.
మాయ టాటా (34).. ఆమె ప్రస్తుతం టాటా ఫైనాన్షియల్ సంస్థలో విశ్లేషకురాలిగా పనిచేస్తున్నారు. ఆపర్చునిటీస్ ఫండ్, టాటా డిజిటల్ లో కీలక బాధ్యతల్లో ఉన్నారు.
నెవిల్లే టాటా (32).. రతన్ టాటా సామ్రాజ్యానికి వారసుడిగా కూడా ఇతన్ని చూస్తున్నారు. అతను టయోటా కిర్లోస్కర్ గ్రూప్ వారసురాలు మాన్సీ కిర్లోస్కర్ ను వివాహం చేసుకున్నాడు. జంషెడ్ టాటా అనే కుమారుడుఉన్నాడు. ట్రెంట్ లిమిటెండ్ కింద టాటా స్టార్ బజార్ అనే హైపర్ మార్కెట్ చైన్ కు నెవిల్లే నాయకత్వం వహిస్తున్నాడు.