దా ‘రుణ’ యాప్‌లపై RBI స్పందన : ఇక్కడ ఫిర్యాదు చేయండి

దా ‘రుణ’ యాప్‌లపై RBI స్పందన : ఇక్కడ ఫిర్యాదు చేయండి

Updated On : December 23, 2020 / 7:00 PM IST

RBI cautions against unauthorised lending apps : లోన్ యాప్‌ (Loan Aap)లపై RBI (Reserve Bank of India) స్పందించింది. ఆన్ లైన్ యాప్‌ల వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించింది. చట్టానికి వ్యతిరేకంగా ఫైనాన్స్ (Finance) వ్యాపారం నడుపుతున్న వారిపై చర్యలు తీసుకొనేందుకు ఆర్బీఐ రంగం సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. కొన్ని యాప్స్ అధిక వడ్డీలు, రుసుములు తీసుకుంటున్నట్లు తమకు తెలిసిందని, సులభంగా రుణాలు ఇస్తున్నారని యాప్‌లో మాయలో పడొద్దని ఆర్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) యోగేశ్ దయాల్ వెల్లడించారు. వ్యక్తిగత డ్యాక్యుమెంట్లు ఎవరకీ ఇవ్వొద్దని, ఈ తరహఆ..యాప్ మోసాలపై sachet.rbi.org.in వెబ్ సైట్‌లో ఫిర్యాదు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించింది. రిజిస్టర్ చేసుకున్న సంస్థలు మాత్రమే రుణాలు ఇవ్వాలని వెల్లడించింది.

ఆర్బీఐ (RBI) గుర్తింపు పొందిన బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (NBFC) వద్ద మాత్రమే రుణాలు తీసుకోవాలని వెల్లడించింది. గుర్తింపు పొందిన రుణ యాప్‌లపై ఫిర్యాదుల కోసం https://cms.rbl.org.in ను సంప్రదించాలని ఆర్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) యోగేశ్ దయాల్ తెలిపారు. గత కొన్ని రోజులుగా..లోన్ యాప్స్ వేధింపుల వల్ల పలువురు బలవన్మరణాలకు పాల్పడుతుండడం కలకలం రేపుతోంది.

తెలుగు రాష్ట్రాల పోలీసులు దీనిపై సీరియస్ అయ్యారు. హైదరాబాద్‌‌తో పాటు..ఢిల్లీ, గుర్గావ్, బెంగళూరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. భాధితులు ధైర్యంగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని తెలుగు రాష్ట్రాల పోలీసులు సూచించారు. యాప్‌ల ద్వారా..అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చి..ప్రజలను వేధిస్తున్న అక్రమార్కులను విడిచిపెట్టొద్దని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.