PM Modi : ప్రధాని మోదీ ర్యాలీ ప్రాంతంలో ఆర్డీఎక్స్ కలకలం.. ఉగ్రవాదుల పనేనా?

PM Modi : ప్రధానమంత్రి నరేంద్రమోదీ జమ్మూలో నిర్వహించిన ర్యాలీ వేదికకు సమీపంలో భారీగా ఆర్డీఎక్స్, నైట్రేట్ పేలుడు పదార్థాలు బయటపడ్డాయి.

PM Modi : ప్రధానమంత్రి నరేంద్రమోదీ జమ్మూలో నిర్వహించిన ర్యాలీ వేదికకు సమీపంలో భారీగా ఆర్డీఎక్స్, నైట్రేట్ పేలుడు పదార్థాలు బయటపడ్డాయి. ఈ నెల 24న ఆదివారం జమ్మూ శివారు ప్రాంతమైన పల్లి గ్రామంలో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బహిరంగ ర్యాలీని నిర్వహించారు.

ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ ప్రసంగించారు. అయితే మోదీ పాల్గొన్న ర్యాలీకి కొద్ది దూరంలోనే ఆర్డీఎక్స్, నైట్రేట్ సమ్మేళాన్ని పోలీసులు ట్రేస్ చేశారు. అయితే వాటిని ఫోరెన్సిక్ నివేదికలో పరీక్షించగా.. మోదీ ర్యాలీ వద్ద కనిపించిన పేలుడు పదార్థాలేనని అధికారలు తేల్చేశారు.

Rdx Traces Found At Site Of Blast Near Pm Modi Rally Venue In Jammu (1)

జమ్మూ కశ్మీర్‌లో ప్రధాని మోదీ ర్యాలీ జరిగే వేదికకు 12 కిలోమీటర్ల దూరంలో లాలియానా గ్రామంలోని మైదానంలో బాంబు పేలుడు సంభవించింది. ఫోరెన్సిక్ నివేదికలో మోదీ సభా స్థలం సమీపంలో లభించినవి పేలుడు పదార్థాలేనని గుర్తించారు. అయితే ఈ బాంబులను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఉగ్రవాద కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఉగ్రవాదులే ఈ పేలుడు పదార్థాలను ఇక్కడ ఫిక్స్ చేసి ఉంటారా? అని పోలీసులు లోతుగా అన్వేషిస్తున్నారు.

మరోవైపు.. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం (ఏప్రిల్ 28) నుంచి అసోంలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా తొలిరోజు కర్బీ అంగ్లాంగ్ జిల్లా దిఫులో శాంతి, ఐక్యత, అభివృద్ధి ర్యాలీలో మోదీ పాల్గొననున్నారు. ఈ ర్యాలీలో మోదీతో పాటు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ డా పాల్గొననున్నారు.

అనంతరం డిఫు వెటర్నరీ కళాశాల, పశ్చిమ కర్బీ అంగ్లాంగ్ డిగ్రీ కళాశాల, కొలోంగా, వెస్ట్ కర్బీ అంగ్‌లాంగ్‌లో వ్యవసాయ కళాశాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. తద్వారా రూ. 500 కోట్ల కన్నా ఎక్కువ విలువైన ప్రాజెక్టులతో నైపుణ్యం, ఉపాధికి కొత్త అవకాశాలను అందించనున్నారు.

Read Also : PM Modi : అసోంలో ప్రధాని మోదీ పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం!

ట్రెండింగ్ వార్తలు