Real Plastic Money Pay For Food (1)
Real plastic money Pay for food with waste at Junagadh cafe : యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ తో పర్యావరణానికి ఎంతో హాని కలుగుతోంది. ఎక్కడ చూసినా వాడి పారేసిన ప్లాస్టిక్ కనిపిస్తుంటుంది. ఈక్రమంలో గుజరాత్ ప్రభుత్వం యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ పై వినూత్న నిర్ణయం తీసుకుంది. ఒక్కసారి వినియోగానికి పనికొచ్చే ప్లాస్టిక్ ఉత్పత్తులపై జులై 1 నుంచి నిషేధం అమల్లోకి రానుంది. ఈ సందర్భంగా గుజరాత్ లోని జునాగఢ్ ప్రాంతంలో జూన్ 30న ప్రారంభమవుతున్న ఒక కేఫ్ గురించి చెప్పుకుని తీరాల్సిందే. ఎందుకంటే..
Also read : Music With Plastic : ప్లాస్టిక్ వ్యర్ధాలతో సంగీత వాయిద్యాలు..టర్కీ బృందం వినూత్న ఆలోచన
జేబులో డబ్బుల్లేకపోయినా..ఈ కేఫ్ లో నచ్చింది తినొచ్చు..తాగొచ్చు. ఏంటీ ఫ్రీ అని అనుకుంటున్నారా? ఫ్రీ అయితే కాదు. కానీ డబ్బులు లేకపోయినా తినొచ్చు. ఎలాగంటే..పర్యావరణానికి తూట్లు పొడిచే ప్లాస్టిక్ చెత్తను తీసుకొచ్చి ఇస్తే చాలు. ఆ కేఫ్ లో అందుబాటులో ఉండేవి తినొచ్చు..తాగొచ్చు. ఇంట్లో వాడి పారేసిన ప్లాస్టిక్ చెత్త ఉంటే..వాటిని ఓ సంచిలో వేసుకుని జునాగఢ్ లోని ఈ కేఫ్ కు వెళితే సరి.
జిల్లా ప్రభుత్వ యంత్రాంగం వినూత్న ఆలోచనలు ప్రతిరూపం ఈ కేఫ్. దీని వల్ల ప్రజల్లో ప్లాస్టిక్ వ్యర్థాలపై అవగాహన సైతం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ కేఫ్ లోని ఆహార పదార్థాల్లో సహజసిద్ధంగా పండించిన ముడి సరుకులను వినియోగిస్తారు. సర్వోదయ సాక్షి మండల్ ఈ కేఫ్ నిర్వహణను చూడనుంది. పర్యావరణంగా స్వచ్ఛమైన, పరిశుభ్రమైన పట్టణంగా జునాగఢ్ ను తీర్చిదిద్దాలన్నది తమ ప్రయత్నమని అధికారులు చెబుతున్నారు.
Also read : UP : సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్ధాలతో 1500 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం
అర కిలో ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకెళ్లి ఇస్తే గ్లాసు నిమ్మరసం ఇస్తారు. కిలో చెత్తకు ఒక పోహ ఇస్తారు. ఈ రెస్టారెంట్ సమీకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను కొనుగోలు చేసేందుకు అధికారులు ఒక ఏజెన్సీని నియమించుకున్నారు.