Petrol Price : తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. లీటర్ పెట్రోల్ పై 17 పైసలు, లీటర్ డీజిల్ పై 18 పైసలు తగ్గాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.105.23, లీటర్ డీజిల్ రూ.96.66కు తగ్గాయి.

Petrol

petrol and diesel prices : వాహనదారులకు శుభవార్త. పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. లీటర్ పెట్రోల్ పై 17 పైసలు, లీటర్ డీజిల్ పై 18 పైసలు తగ్గాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.105.23, లీటర్ డీజిల్ రూ.96.66కు తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు స్థిరంగా కొనసాగుతుండటంతో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. ఈ నెలలో పెట్రోలు, డీజిల్‌ రేట్లు తగ్గడం వరుసగా ఇది రెండో సారి.

మే నెలలో 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత వరుసగా పెట్రోలు, డీజిల్‌ ధరలను చమురు కంపెనీలు పెంచుకుంటూ పోయాయి. దీంతో దేశ వ్యాప్తంగా లీటర్ పెట్రోలు ధర రూ.100 దాటగా, డీజిల్‌ ధర సెంచరీకి చేరువైంది. అయితే ఆగస్టులో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పడిపోవడం ప్రారంభమైంది.

బ్యారెల్‌ ముడి చమురు ధర 75 డాలర్ల నుంచి 64 డాలర్లకు పడిపోయింది. కొంతకాలంగా కొంచెం అటుఇటుగా అక్కడే కొనసాగుతోంది. దీంతో చమురు కంపెనీలు కొద్ది కొద్దిగా ధరలను తగ్గిస్తున్నాయి.