రిలయన్స్ ఇండస్ట్రీ చరిత్ర సృష్టించింది. భారతదేశంలో ఉన్న కంపెనీలన్నింటిలోకెల్లా అత్యధిక మార్కెట్ విలువతో రికార్డు నెలకొల్పింది. శుక్రవారం నాటికి రూ.9 లక్షల కోట్ల మార్కెట్ విలువను సంపాదించుకుంది. మధ్యాహ్నం అవడానికి ముందు BSEలో ట్రేడ్ విలువ రూ. 9,01,490.09 కోట్లుగా నిలిచింది.
2.28శాతం కంటే ఎక్కువగా గ్రీన్ రేంజ్‌లో ట్రేడింగ్ అవుతూ ఒక్కో షేర్ విలువ ఒక వెయ్యి 428 రూపాయలకు చేరుకుంది. ఆగస్ట్ 2018లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ రూ.8లక్షల కోట్లుకు చేరి అప్పటి మార్కెట్ విలువకు సంచలనంగా మారాడు.
టెలికాం రంగంలో అడుగుపెట్టి తక్కువ కాలంలోనే దిగ్గజంగా ఎదిగిన జియో నెట్‌వర్క్‌లను శాసిస్తుంది. వ్యూహం ప్రకారం.. ఉచితంగా డేటా ఇస్తామని ప్రారంభించి ఆ తర్వాత మెంబర్ షిప్‌లు అని, మూడు నెలల ప్యాకేజీ అని మొదలుపెట్టి ఇతర నెట్‌వర్క్‌లకు అవుట్ గోయింగ్ కాల్ చేస్తే నిమిషానికి 6పైసలు చొప్పున వసూలు చేస్తుంది. ఈ స్థాయిలో వసూలు చేస్తే మార్కెట్ విలువ పెరగదా మరి.