COVID Drug : కరోనాపై పోరు, రిలయన్స్ సరికొత్త డ్రగ్

కరోనాపై పోరుకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సరికొత్త డ్రగ్‌ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. కోవిడ్‌ రోగులకు నిక్లోసమైడ్‌ డ్రగ్‌ను ఉపయోగించవచ్చని ప్రతిపాదించింది. దీన్ని వినియోగించేందుకు అనుమతులు కోరుతూ రిలయన్స్‌ దరఖాస్తు చేసింది. తన వార్షిక నివేదికలో కూడా ఈ అంశాన్ని పేర్కొంది. అయితే దీనిపై DCGI నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Reliance’s Newest Drug : కరోనాపై పోరుకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సరికొత్త డ్రగ్‌ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. కోవిడ్‌ రోగులకు నిక్లోసమైడ్‌ డ్రగ్‌ను ఉపయోగించవచ్చని ప్రతిపాదించింది. దీన్ని వినియోగించేందుకు అనుమతులు కోరుతూ రిలయన్స్‌ దరఖాస్తు చేసింది. తన వార్షిక నివేదికలో కూడా ఈ అంశాన్ని పేర్కొంది. అయితే దీనిపై DCGI నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ఈ మందును తయారు చేసేందుకు రిలయన్స్ ప్రణాళికలు రచిస్తోందా లేక గ్రూప్‌ ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రుల్లో దీన్ని వినియోగిస్తారా అన్నదానిపై స్పష్టత లేదు.

నికోల్సమైడ్‌ మందును 50 ఏళ్లుగా నులిపురుగుల నివారణకు వాడుతున్నారు. ప్రస్తుతం ఇది ప్రపంచ ఆరోగ్యసంస్థ అత్యవసర మందుల జాబితాలో భాగంగా ఉంది. గతంలో సార్స్‌ మహమ్మారి ప్రపంచాన్ని వణికించినప్పుడు కూడా ఈ డ్రగ్‌ను వాడారు. భారత ప్రభుత్వం కోవిడ్‌ రోగుల చికిత్సలో దీన్ని వినియోగించేందుకు పేజ్‌-2 క్లీనికల్‌ ట్రయల్స్‌కు అనుమతి ఇచ్చింది. రిలయన్స్ గ్రూప్‌ వైరస్‌, బ్యాక్టీరియాలపై పొరలను నాశనం చేసే నెక్సర్‌ పాలిమర్‌పై పలు రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సంస్థలతో కలసి పనిచేస్తోంది.

రిలయన్స్ ఇప్పటికే కోవిడ్‌ డయాగ్నస్టిక్‌ కిట్లను డెవలప్‌ చేసింది. వాటికి ఇప్పటికే ICMR అనుమతి కూడా లభించింది. మార్కెట్‌ ధరలో 20శాతం ధరకే WHO ప్రామాణికాల ప్రకారం శానిటైజర్లను ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నిస్తోంది. వెంటిలేటర్ల తయారీ ప్రయత్నాల్లోనూ ఉంది. భారత్‌ను వేధిస్తున్న పలు సమస్యలకు పరిష్కారాలు చూపేందుకు 9 వందల మంది సైంటిస్టులు, పరిశోధకులు రిలయన్స్‌ నెక్స్ట్‌ జనరేషన్‌ టెక్నాలజీ రూపకల్పనలో ఉన్నట్లు రిలయన్స్ చెబుతోంది.

Read More : Tirupati : సైకిల్ పై భూమన పర్యటన, షాకింగ్ విషయాలు

ట్రెండింగ్ వార్తలు