ఇదో స్వీట్ మ్యాగీ : చాకొలేట్ దోసె.. ఎంతో టేస్టీ గురూ!

  • Publish Date - October 5, 2019 / 08:02 AM IST

ఫాస్ట్ ఫుడ్ ప్రియులకు స్పైసి ఫుడ్ అంటే తెగ ఇష్టపడతారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఎక్కువగా తినేది వంటకం దోసె. ఎంతో టేస్టీగా ఉంటుంది. ప్లేన్ దోసె, మసాలా దోసె, ఎగ్ దోసె ఇలా ఎన్నో రకాల టెస్టీ దోసె రుచులను ఆశ్వాదిస్తుంటారు. స్పైసి మ్యాగీని లొట్టలేసుకుంటూ తినేస్తారు.

ఇప్పటివరకూ స్పైసి ఫుడ్ లను మాత్రమే చూశాం. స్వీట్ మ్యాగీని ఎప్పుడైనా తిన్నారా? చూశారా? చాకొలేట్ దోసెను తిన్నారా? భలే టేస్టీగా ఉంటుందంట. స్వీట్ మ్యాగీ పేరుతో ఇంటర్నెట్ లో ఇప్పుడి ఈ వంటకం హల్ చల్ చేస్తోంది. 

తినకుండానే నెట్టింట్లో నోరు ఊరిపోతుంది నెటిజన్లకు. చాకొలేట్ దోసె తయారీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దర్శన్ పతాక్ అనే యూజర్ ఈ వీడియోను షేర్ చేశాడు. వీడియోలోని వ్యక్తి ముఖం సరిగా కనబడటం లేదు. పెనం మీద దోసె పిండి వేసి దానిపై వెన్న రాసి చాకొలేట్ వాటర్ పోశాడు.

అంతేకాదు.. డ్రై ఫ్రూట్స్, చెర్రీలు కూడా వేశాడు. ఎంతో తియ్యని రుచికరమైన చాకొలేట్ దోసె తయారైంది. అతడు వేసిన చాకొలేట్ దోసె తినకుండానే ఎంతో టెస్టీగా ఉందని అదుర్స్ అంటున్నారు నెటిజన్లు. ఫన్నీ కామెంట్లతో వీడియోను షేర్ చేస్తున్నారు.