Mangalasutra
Mangalasutra: భార్య తనంతట తానే తాళిబొట్టను తీసేయడమనేది భర్త పట్ల ఆమె చూపించే క్రూరమైన చర్యగా పేర్కొంది మద్రాస్ హైకోర్టు. ఈ క్రమంలో వారిద్దరికీ విడాకులు మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. జస్టిస్‌లు వీఎమ్ వేలుమణి, ఎస్ సంతర్‌ల డివిజన్ బెంచ్ మెడికల్ కాలేజిలో ప్రొఫెసర్ గా పనిచేసే అప్పీలుదారు శివకుమార్ అభ్యర్థనను పరిశీలించింది.
2016 జూన్ 15న విడాకులను నిరాకరించాలని లోకల్ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించాడు. మహిళవైపు విచారణ జరిపిన తర్వాత వారిద్దరూ విడిపోతున్న సమయంలో ఆమె మంగళసూత్రపు గొలుసు తీసేసినట్లు ఒప్పుకుంది. దీనిపై వివరణ ఇచ్చిన ఆమె కేవలం గొలుసు మాత్రమే తీసేశానని మంగళసూత్రం అలాగే ఉంచుకున్నానని చెప్పింది.
ఆమె తరపు న్యాయవాది హిందూ వివాహ చట్టం సెక్షన్ 7 ప్రకారం.. భార్య తాళిబొట్టును తీసేయడం వివాహ బంధంపై పెద్ద ప్రభావం చూపదని వాదించారు. కానీ, హిందూ సంప్రదాయంలో వివాహానికి తాళి బొట్టు చాలా ప్రాముఖ్యంగా మారిందని బెంచ్ తీర్పునిచ్చింది.
Read Also : విడాకులు తీసుకున్న భార్యను తాళ్లతో కట్టేసి..నాలుగో అంతస్తు నుంచి తోసేసి…….
హైకోర్టు డివిజన్ బెంచ్… అందిన వివరాల ప్రకారం.. మహిళ తనకు తానుగా తాళి బొట్టు తీసి బ్యాంకు లాకరులో ఉంచినట్లు ఒప్పుకుందని వెల్లడైంది. తన జీవిత కాలంలో భర్త బతికుండగా హిందూ మహిళ తాళిబొట్టు తీయడానికి ఒప్పుకోదనే విషయం అందరికి తెలుసు. అంతేకాకుండా తాళి బొట్టుతో పాటు ఆ గొలుసు కూడా మెడ చుట్టూ ఉంటుంది. భర్త బతికున్నంత కాలం అలాగే ఉంటుంది. అలాంటి తాళి బొట్టును తొలగించడం.. బాధ్యుల సెంటిమెంట్లను కించపరచడం వంటిదని” బెంచ్ పేర్కొంది.
భార్యభర్తలు 2011 నుంచి విడిగా ఉంటుండగా.. ఇప్పటివరకూ భర్తతో కలిసి బతికేందుకు ఎటువంటి ప్రయత్నం చేయలేదని అందులో రుజువైంది. వారి వివాహబంధానికి ముగింపు పలికి.. విడాకులు తీసుకోవాలంటూ హైకోర్టు తీర్పునిచ్చింది.