Akbar Road
BJP Media Cell Head : ఢిల్లీ లుటియన్స్‌లోని అక్బర్ రోడ్డు పేరును తమిళనాడులో ఇటీవల జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన తొలి త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ మార్గంగా మార్చాలని ఢిల్లీ బీజేపీ మీడియా విభాగం హెడ్ నవీన్ కుమార్ జిందాల్ మాండ్ చేశారు. ఈ మేరకు ఆయన న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్(NDMC)కు ఓ లేఖ రాశారు.
అక్బర్ ఒక ‘ఆక్రమణదారుడు’ అని, ప్రముఖ మార్గమైనందున దీనికి జనరల్ రావత్ పేరు పెట్టాలని కోరారు. అక్బర్ రోడ్డు పేరును మార్చడం ద్వారా దేశ మొట్టమొదటి సీడీఎస్ జ్ఞాపకాలను ఢిల్లీలో శాశ్వతంగా నిలిచేలా చూడాలని కోరారు. జనరల్ రావత్‌కు కౌన్సిల్ ఇచ్చే నిజమైన నివాళి ఇదేనని తాము నమ్ముతున్నామన్నారు.
దీనిపై ఎన్‌డీఎంసీ వైస్ చైర్మన్ సతీశ్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ.. ఈ డిమాండ్ పట్ల తాను సానుకూలంగా ఉన్నానమని, దీనిపై ఎన్‌డీఎంసీలో చర్చించాలన్నారు. ఎన్‌డీఎంసీ నిర్ణయాధికారులు దీనిపై చర్చిస్తారన్నారు. ఇదిలా ఉండగా, అక్బర్ రోడ్ పేరు మార్చాలని డిమాండ్లు, అభ్యర్థనలు రావడం ఇదే తొలిసారి కాదు.
ALSO READ Netaji’s Picture On Currency : కరెన్సీ నోట్లపై నేతాజీ ఫొటో..కేంద్రానికి 8 వారాల గడువు!