rented room like a prison : జైలు గది కాదు నమ్మండి.. బెంగళూరులో అద్దె ఇల్లు ఫోటో వైరల్

బెంగళూరు, ముంబయి లాంటి మహా నగరాల్లో అద్దెకి ఇల్లు దొరకడం మహా కష్టంగా ఉంది. ఇల్లు నచ్చితే అద్దె రేట్లు, అద్దె రేట్లకి అడ్జస్ట్ అయినా యజమానుల ఆంక్షలు.. ఇలాంటి పరిస్థితుల్లో ఓ వ్యక్తికి సకల సౌకర్యాలతో అద్దె గది దొరికింది. ఇంతకీ ఆ గది స్టోరి ఏంటి?...

rented room like a prison : రోజురోజుకి నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వాటితో పాటు ఇళ్ల అద్దెలు (house rent)  కూడా చుక్కలు చూపిస్తున్నాయి. బెంగళూరు  (bangalore), ముంబయి (mumbai) లాంటి మహానగరాల్లో పరిస్థితి ఘోరంగా ఉంది. విపరీతమైన అద్దెలతో పాటు యజమానులు పెట్టే ఆంక్షలు జనానికి ఇబ్బందిగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని సౌకర్యాలు ఉండి చిన్న గది అద్దెకు దొరికినా చాలు అనుకునే వారికి సకల సౌకర్యాలతో బెంగళూరులో అద్దె ఇల్లు కాదు.. కాదు రూం దొరుకుతోంది.. చూడగానే జైలు (prison) అనుకునేరు.. అన్ని సౌకర్యాలతో ఉన్న ఆ రూం తనకు అద్దెకు దొరికిందని ఓ వ్యక్తి ఫోటోతో సహా షేర్ చేయడంతో ఈ వార్త వైరల్ గా (viral) మారింది.

Tenant Interview : ఆ సిటీలో అద్దెకి ఇల్లు దొరకడం కంటే .. గూగుల్ లో జాబ్ కొట్టడం ఈజీ

బెంగళూరులో అద్దె ఇల్లు దొరకడం అంటే ఎగిరి గంతులు వేయచ్చన్నమాట. ప్రస్తుతం అక్కడి పరిస్థితులు అలాగే ఉన్నాయి. మంథన్ గుప్తా (@manthanguptaa) అనే వ్యక్తి అద్దె ఇంటి కోసం ఎంత విసిగిపోయాడో ఏమో? చివరికి ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. ఆ ఇంటిని చూస్తే అందరూ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టినా ప్రస్తుత పరిస్థితుల్లో ఇంద్రభవనాన్ని తలపిస్తోంది. చక్కని వెంటిలేషన్ తో (ventilation)మనకు అత్యవసరంగా కావాల్సిన వస్తువుల్ని అమర్చుకునే వీలుగా ఉంది ఆ రూం. చూడగానే జైలు గదిలా అనిపించినా అన్ని సౌకర్యాలు ఉన్న అద్దె రూం ఇది. మొత్తానికి నాకు అద్దె ఇల్లు దొరికిందని అతను సంతోషంగా షేర్ చేసిన ఈ ఇంటి ఫోటో ఇప్పుడు ఇంటన్నెట్ లో వైరల్ గా మారింది.

man dangerous bike stunt : ప్రియురాళ్లతో ఓ యువకుడి డేంజరస్ బైక్ స్టంట్.. ముంబయి పోలీసుల ట్వీట్

మంథన్ గుప్తా పోస్ట్ పై జనాలు స్పందిస్తున్నారు. జైలులా ఉందని కొందరు.. ముంబయితో పోలిస్తే చక్కని ఇల్లు దొరికిందని కొందరు, పార్టీ ఎప్పుడు ఇస్తావ్ బ్రదర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ ఫోటో చూస్తే మాత్రం నగరాల్లో అద్దె ఇల్లు దొరకడం అంటే ఎంత కష్టమైన సమస్యగా మారిందో అర్దం చేసుకోవచ్చు.

 

 

ట్రెండింగ్ వార్తలు