man dangerous bike stunt : ప్రియురాళ్లతో ఓ యువకుడి డేంజరస్ బైక్ స్టంట్.. ముంబయి పోలీసుల ట్వీట్
ఏదో ఒక సంచలనం క్రియేట్ చేయాలి.. అందరి దృష్టిని ఆకర్షించాలి.. ఇప్పటి యూత్ లో చాలామందికి ఇదే ఆలోచన. అందుకోసం ఏమి చేయడానికైనా సిద్ధమవుతున్నారు. తాజాగా ముంబయిలో ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిలతో కలిసి చేసిన భయంకరమైన బైక్ స్టంట్ ఇంటర్నెట్ లో వైరల్ గామారింది.

man dangerous bike stunt
man dangerous bike stunt : ప్రాణం పోయినా పర్లేదు తాను హీరో అనిపించుకోవాలి అనుకుంటున్నారు కొందరు యూత్ (Youth). రకరకాల ఫీట్లు చేసి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. లేదంటే జీవచ్ఛవాల్లా మిగులుతున్నారు. ఎన్ని ఘటనలు కళ్ల ముందు కనిపిస్తున్నా కొందరికి బుద్ధి రావడం లేదు. ముంబయిలో ఓ యువకుడు నిబంధనలకు విరుద్ధంగా ఇద్దరు అమ్మాయిల్ని బైక్ పై కూర్చొపెట్టుకుని చేసిన భయంకరమైన స్టంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముంబయి (mumbai) పోలీసులు వీరిపై కేసు నమోదు చేశారు.
Shocking Video: స్టంట్ చేయాలనుకున్నాడు.. దారుణంగా కింద పడ్డాడు.. షాకింగ్ వీడియో
ముంబయి వీధుల్లో ఓ యువకుడు డేంజరస్ (dangerous) బైక్ స్టంట్ (bike stunt) చేశాడు. తాను హీరో అనిపించుకోవాలనుకున్నాడేమో ఇద్దరు అమ్మాయిల్ని ముందు వెనుక కూర్చోబెట్టుకుని విపరీతమైన వేగంతో డ్రైవ్ చేశాడు. బైక్ ముందు చక్రం గాల్లో తేలిపోతుంటే వెర్రి ఆనందంతో నడుపుతూ ముందుకు వెళ్లాడు. పైగా బైక్ మీద ఉన్న ముగ్గురిలో ఎవరూ హెల్మెట్స్ (helmet) ధరించలేదు. ఈ వీడియో కాస్తా ముంబయి BKC పోలీస్ స్టేషన్ కు (mumbai BKC police) చేరింది. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు వీడియోలోని వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. ఆచూకి తెలిసిన వారు తమను సంప్రదించాలని ట్వీట్ చేశారు.
Tom Cruise : 60 ఏళ్ళ ఏజ్ లో ఇన్ని స్టంట్స్.. మిషన్ ఇంపాజిబుల్ 7 సినిమా కోసం టామ్ క్రూజ్ విన్యాసాలు..
అతి వేగం ప్రాణాల మీదకు తెస్తుందని.. హెల్మెట్ లేకుండా బైక్ లు నడపొద్దని పోలీసులు మొత్తుకుంటున్నా యువత లెక్కచేయట్లేదు. పైగా ఇలాంటి స్టంట్స్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వైరల్ అవ్వడం మాట అటుంచి తల్లిదండ్రులకు తీరని వేదన మిగులుస్తున్నారు. ఇలాంటి ఫీట్స్ చేసే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మరోవైపు జనం పోలీసులను కోరుతున్నారు.
Perform #dangerous #bike #stunts..#Mumbai Police has registered a case after a video of three unidentified people performing a bike stunt went viral on social media.
All three have been booked by the police..#Mumbai@MumbaiPolice @MTPHereToHelp pic.twitter.com/MWv3YqkR5S
— Indrajeet chaubey (@indrajeet8080) April 1, 2023