Upsc Jobs : యూపీఎస్సీ ఉద్యోగాల భర్తీ

స్టోర్స్‌ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

Upsc Jobs : యూపీఎస్సీ ఉద్యోగాల భర్తీ

Upsc

Updated On : February 14, 2022 / 8:22 PM IST

Upsc Jobs : యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా వివిధ విభాగాల్లో ఉన్న మొత్తం 33 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, స్టోర్స్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ మినరల్‌ ఎకనామిస్ట్‌ పోస్టులు ఉన్నాయి.

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు సంబంధించి నేవీ,ఆయుష్‌ విభాగాల్లో హిస్టరీ, ఆయుర్వేద విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ, ఆయుర్వేద మెడినిసిన్‌లో డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్‌ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. నెట్‌,సెట్‌,స్లెట్‌ అర్హత పొంది ఉండాలి. అభ్యర్థుల వయసు 35 నుంచి 48 ఏళ్ల మధ్య ఉండాలి.

స్టోర్స్‌ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 30 ఏళ్ల మధ్య ఉండాలి. అసిస్టెంట్‌ మినరల్‌ ఎకనామిస్ట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ, బ్యాచిలర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తులు ఆన్ లైన్ లో పంపాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ అధారంగా తుది ఎంపిక ఉంటుంది. దరఖాస్తులను ఆఖరు తేది మార్చి 3, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు https://www.upsc.gov.in/