దేశవ్యాప్తంగా 71వ గణతంత్ర వేడుకలు : రిపబ్లిక్ డే అంటే ఏమిటి.. ఎందుకు జరుపుకుంటారు..

1950 జనవరి 26. భారత దేశ చరిత్రలో ముఖ్యమైన రోజు. జనవరి 26న మన దేశం సొంతంగా రూపొందించుకున్న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ సందర్భంగా ఏటా జనవరి 26న

  • Publish Date - January 26, 2020 / 02:01 AM IST

1950 జనవరి 26. భారత దేశ చరిత్రలో ముఖ్యమైన రోజు. జనవరి 26న మన దేశం సొంతంగా రూపొందించుకున్న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ సందర్భంగా ఏటా జనవరి 26న

1950 జనవరి 26. భారత దేశ చరిత్రలో ముఖ్యమైన రోజు. జనవరి 26న మన దేశం సొంతంగా రూపొందించుకున్న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ సందర్భంగా ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇదే రోజున మన దేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. మన దేశంలో బ్రిటీష్ చట్టాలన్నీ తొలగిపోయి.. భారత రాజ్యాంగం ప్రకారం చట్టాలు అమలవడం మొదలైంది. అలా ఇప్పటికి 70 ఏళ్లుగా మనం ఈ వేడుకలు జరుపుకుంటున్నాం. ఇవాళ జరుగుతున్నవి 71వ వేడుకలు.

 

1947 ఆగస్టు 29న రాజ్యాంగ ముసాయి కమిటీ ఏర్పాటు:
200 ఏళ్ల పాటు బ్రిటీష్‌ వారి పాలనలో మగ్గిన భారతీయులకు ఎందరో త్యాగధనుల పోరాట ఫలంతో ఆగస్టు 15, 1947న స్వాతంత్ర్యం వచ్చింది. అయితే అప్పటివరకు భారత దేశంలో బ్రిటీష్ రాజ్యాంగం అమల్లో ఉండేది. ఆ రాజ్యాంగం ప్రకారం పరిపాలన సాగేది. స్వాతంత్య్రం తర్వాత మనకు ఓ ప్రత్యేక రాజ్యాంగం అవసరమని 1947, ఆగస్టు 29న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఛైర్మన్‌గా రాజ్యాంగ ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు.

 

1949 నవంబర్ 26న భారత రాజ్యాంగానికి ఆమోదం:
1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. మన రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగంగా గుర్తింపు పొందింది. మనం సొంతంగా రూపొందించుకున్న రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి భారత్ ‘సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్య’ రాజ్యంగా అవతరించింది. ఆ రోజునే మనం ఏటా గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాము.

 

దేశవ్యాప్తంగా 71వ గణతంత్ర వేడుకలు:
దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రజలు శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. జాతీయ జెండాకు, సైనికులకు వందనాలు సమర్పిస్తున్నారు. ఢిల్లీలో భారీ భద్రత మధ్య గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. ఈసారి వేడుకలకు ముఖ్య అతిథిగా బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో వచ్చారు. ఆయనకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. మొదటి నుంచి బ్రెజిల్ భారత్ కు మిత్రదేశంగా ఉంది. రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ వేడుకలతో ఆ బంధం మరింత బలపడింది.

ట్రెండింగ్ వార్తలు