WhatsApp Privacy: కేంద్రం తెచ్చిన నిబంధనల్లో ప్రైవసీ లేదు – వాట్సప్

ఫేస్‌బుక్, వాట్సప్, ట్విట్టర్ లు లాంటి సోషల్ మీడియా అకౌంట్లపై కొత్త ఐటీ నిబంధనలు విధించింది కేంద్రం. వాటికి లోబడి ఉంటేనే కొనసాగిస్తామని లేదంటూ మధ్య వర్తిత్వ హోదా రద్దు చేస్తామని ప్రకటించింది.

WhatsApp Privacy: ఫేస్‌బుక్, వాట్సప్, ట్విట్టర్ లు లాంటి సోషల్ మీడియా అకౌంట్లపై కొత్త ఐటీ నిబంధనలు విధించింది కేంద్రం. వాటికి లోబడి ఉంటేనే కొనసాగిస్తామని లేదంటూ మధ్య వర్తిత్వ హోదా రద్దు చేస్తామని ప్రకటించింది. వీటిని పరిశీలించిన వాట్సప్.. కేంద్రం తీసుకొచ్చిన నిబంధనలు పర్సనల్ ప్రైవసీకి భంగం కలిగేలా ఉందని ఆరోపించింది.

బుధవారం నుంచి అమల్లోకి వచ్చిన ఐటీ నియమ నిబంధనలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. వాట్సాప్ హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. తక్షణమే నిలిపివేయాలని విజ్ఞప్తి చేస్తూ.. కేంద్ర ప్ర‌భుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిష‌న్ వేసిన‌ట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రైవసీకి భంగం ఎలాగంటే..
కొత్త నిబంధనల ప్రకారం కేంద్రం అడిగినప్పుడు కొన్ని పోస్టుల మూలాల గురించి చెప్పాలి. ఇది భారత రాజ్యాంగం ప్రకారం వ్యక్తుల గోప్యత హక్కులను ఉల్లంఘించ‌డ‌మేన‌ని వాట్సాప్‌ ఆరోపిస్తుంది. వాట్సాప్‌లో ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్టెడ్‌ సందేశాలు ఉంటాయని, కొత్త ఐటీ నిబంధనలను అనుసరిస్తే ఆ ఎన్‌క్రిప్షన్‌ను పక్కన పెట్టాల్సి వస్తుంద‌ని వాట్సాప్‌ వాదన వినిపిస్తోంది.

ఢిల్లీ హైకోర్టులో వాట్సాప్ పిటిష‌న్‌ దాఖలు చేసి ఈ రూల్స్ అండ్ రెగ్యూలేషన్స్ ను వెంటనే ఆపేయాలని కోరుతుందట. కేంద్రం ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన కొత్త నిబంధనల అమలుకు చర్యలు చేపడతామని వాట్సాప్‌ మాతృ సంస్థ ఫేస్‌బుక్‌ చెప్పడం గమనార్హం.

ట్రెండింగ్ వార్తలు