Firing In Wedding Ceremony : పెళ్లి జరుగుతుండగా జై శ్రీరామ్ అంటూ కాల్పులు..ఒకరు మృతి
పెళ్లి వేడుకలోకి ఓ అల్లరిమూక దూసుకొచ్చి జై శ్రీరామ్..జై శ్రీరామ్ అంటూ కాల్పులకు పాల్పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.

Open Fire
Rioters open fire One killed : పెళ్లి వేడుకలోకి ఓ అల్లరిమూక దూసుకొచ్చి జై శ్రీరామ్..జై శ్రీరామ్ అంటూ కాల్పులకు పాల్పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…భెసోడి మండి గ్రామంలోని బాబా రామ్ పాల్ అనే మత గురువు అనుచరులు డిసెంబర్ 12న జామునియా గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు తరలివచ్చారు. కానీ వారి రావడాన్ని గ్రామస్తులు వ్యతిరేకించారు. పెళ్లికి ముందు బాబా అనుచరులకు గ్రామస్తులకు మధ్య ఘర్షణ జరిగింది.
ఆ తర్వాత పెళ్లి ముహూర్తం సమయంలో బాబా రామ్ పాల్ అనుచరులు గుంపుగా అక్కడి దూసుకొచ్చి..జై శ్రీరామ్..జై శ్రీరామ్..అంటూ అరుస్తూ కాల్పులు జరిపారు. దీంతో పెళ్లికి అతిథిగా వచ్చిన గ్రామ పెద్ద దేవీ లాల్ మీనాకు తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స కోపం ఆయన్ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే పరిస్థితి విషమించడంతో మరణించారు.
Flexi In Tirupati : తిరుపతిలో ఫ్లెక్సీల కలకలం….అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్న మార్గంలోనే
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని 11 మంది నిందితులను గుర్తించారు. వీరిలో నలుగురు పోలీసులకు పట్టుబడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పెళ్లిలో ఓ వ్యక్తి వీడియో తీయడంతో పోలీసులు వారిని గుర్తించి పట్టుకున్నారు. నిందితులందరూ ఆ గ్రామస్తులే కావడం గమనార్హం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.