Gold Price : పెరుగుతున్న బంగారం ధ‌ర‌

బంగారం ధ‌ర‌లు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా పసిడి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో తులం స్వ‌చ్ఛ‌మైన బంగారం ధ‌ర రూ.46,353కు చేరింది.

Gold (1)

Rising gold prices : బంగారం ధ‌ర‌లు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా పసిడి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో తులం స్వ‌చ్ఛ‌మైన బంగారం ధ‌ర రూ.46,353కు చేరింది. క్రితం ట్రేడ్‌లో తులం 24 క్యార‌ట్ బంగారం ధ‌ర రూ.46,225 వ‌ద్ద ముగిసింది.

కాగా గ‌త ఏడాది ఆగ‌స్టులో బంగారం ధ‌ర‌లు ఏకంగా రూ.56 వేల పీక్ స్థాయిని తాకింది. ఆ త‌ర్వాత క్ర‌మంగా త‌గ్గుతూ వ‌చ్చాయి. అయితే ఈ ఏడాది ఆగస్టులో మాత్రం ధరలు పెరుగుతున్నాయి.

అయితే, వెండి ధ‌ర‌లు మాత్రం ఢిల్లీ మార్కెట్‌లో స్థిరంగా ఉన్నాయి. ఇవాళ కిలో వెండి ధర కేవ‌లం రూ.6 పెరిగి రూ.60,897కు చేరింది. క్రితం ట్రేడ్‌లో కిలో వెండి ధ‌ర రూ.60,891 వ‌ద్ద ముగిసింది.

ఇక రూపాయి మార‌కం విలువ కూడా ఇర‌వై పైస‌లు బ‌ల‌హీన‌ప‌డి రూ.74.44 కు చేరింది. ఇక అంత‌ర్జాతీయంగా ఔన్స్ బంగారం ధ‌ర రూ.1,786, ఔన్స్ వెండి ధ‌ర రూ.23.23 అమెరిక‌న్ డాల‌ర్లు ప‌లికింది.