లక్నో : రోడ్డు ప్రమాదాలతో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అతివేగం..డ్రైవింగ్ లో నిర్లక్ష్యం..మద్యం తాగి వాహనం నడపటం..వంటి కారణాలతో జరగుతున్న ప్రమాదాలతో పలువురు మృతి చెందుతున్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ ఫతేబాద్‌లోని ఆగ్రా – లక్నో ఎక్స్‌ప్రెస్ హైవేపై గురువారం (ఏప్రిల్ 11) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
వేగంగా వెళ్తున్న ఎర్టికా కారు అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. అయితే మృతదేహాల వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.