Rs.280 Crores Worth Heroin Seize In Gujarath
Heroin Seize In Gujarath: భారత తీరప్రాంత రక్షణ దళం గుజరాత్ తీరంలో..పెద్దమొత్తంలో హెరాయిన్‌ను పట్టుకుంది. పాకిస్తాన్‌కు చెందిన పడవలో 280 కోట్ల రూపాయలు విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుంది. భారత తీరప్రాంత రక్షణ దళం గుజరాత్ అరేబియా సముద్ర తీరంలో పెద్దమొత్తంలో హెరాయిన్‌ను పట్టుకుంది . భారత్ వైపు వస్తున్న పాకిస్తాన్‌కు చెందిన పడవలో 280 కోట్ల రూపాయలు విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసింది. గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళంతో కలిసి ఈ ఆపరేషన్‌ను చేపట్టారు.
రెండు దళాలు సంయుక్తంగా చేసిన ఈ ఆపరేషన్‌లో హెరాయిన్‌ను అక్రమంగా తరలిస్తున్న 9 మందిని అరెస్టు చేశారు. అరెస్ట్ చేసిన నిందితులను.. కచ్ జిల్లాలోని జకావూ పోర్టుకు తరలించినట్లు అధికారులు తెలిపారు. పాకిస్థానీ బోట్ ‘అల్ హజ్’ భారత జలాల్లోకి ప్రవేశించినప్పుడు తీర ప్రాంత రక్షణ నౌకలు అడ్డుకుని పట్టుకున్నాయని పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.