మహిళలు ఇళ్లలోనే ఉండాలని ఆర్ఎస్ఎస్, బీజేపీ భావిస్తున్నాయి: రాహుల్ గాంధీ

భారతీయ పురుషులకు మహిళల పట్ల ప్రదర్శించే వైఖరి హాస్యాస్పదంగా ఉంటుందని చెప్పారు.

PM modi and Rahul

Rahul Gandhi: మహిళలు ఇళ్లలోనే ఉండాలని ఆర్ఎస్ఎస్, బీజేపీ భావిస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. అమెరికాలోని డల్లాస్‌లో ప్రవాస భారతీయులు నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు.

భారతదేశం యావత్తు ఒకే భావజాలానికి సంబంధించినదని ఆర్ఎస్ఎస్ నమ్ముతుందని, కానీ కాంగ్రెస్ మాత్రం ఇండియాను అనేక భావజాలాలకు సంబంధించినదిగా పరిగణిస్తుందని చెప్పారు. బీజేపీపై, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రజలకు ఉన్న భయం అంతా లోక్‌సభ ఎన్నికల తర్వాత పోయిందని అన్నారు.

ఈ విజయం కేవలం తనది, కాంగ్రెస్ పార్టీది మాత్రమే కాదని, భారతదేశ ప్రజలదని చెప్పారు. రాజ్యాంగంపై దాడి చేస్తే తాము అంగీకరించబోమని ప్రజలు స్పష్టం చేశారని అన్నారు. భారతీయ పురుషులకు మహిళల పట్ల ప్రదర్శించే వైఖరి హాస్యాస్పదంగా ఉంటుందని చెప్పారు.

మహిళలు సమాజంలో ఒకే పాత్రను పోషించాలని, వారు ఇంట్లోనే ఉండాలని, వంటలు వండాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావిస్తాయని అన్నారు. మహిళలు ఎక్కువగా మాట్లాడకూడదని బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఉద్దేశమని చెప్పారు. దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతుందని అన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరాలు తెలుపుతోంది.

Also Read: పార్టీ మారిన ప్రజా ద్రోహులు తమ సభ్యత్వాన్ని కోల్పోవడం ఖాయం: జగదీశ్ రెడ్డి

ట్రెండింగ్ వార్తలు