Mohan Bhagwat: మన దేశం పేరు ఇడియా కాదు, భారత్.. అలాగే పిలవాలంటున్న ఆర్ఎస్ఎస్ చీఫ్

మనం మన దేశాన్ని భారతదేశం అని పిలవాలని, అలాగే ఇతరులకు కూడా వివరించాలని భగవత్ అన్నారు. ఐక్యత శక్తిని నొక్కిచెప్పిన ఆయన, భారతదేశం అందరినీ ఏకం చేసే దేశమని అన్నారు

INDIA vs Bharat: ఇండియా అనడానికి బదులుగా భారత్ అనే పేరును ఉపయోగించాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. దేశ ప్రజలు ఈ అలవాటును పెంపొందించుకోవాలని ఆయన కోరారు. భారతదేశం అనే పేరు ప్రాచీన కాలం నుంచి ప్రచారంలో ఉందని, దానినే ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. శుక్రవారం సకల్ జైన సమాజ్ కార్యక్రమంలో భగవత్ ప్రసంగిస్తూ, శతాబ్దాలుగా మన దేశం పేరు భారత్ అనే ఉందని అన్నారు. ఏ భాష అయినా పేరు అలాగే ఉంటుందని, కానీ మన దేశం విషయంలో ఒక భాషల్లో ఒక్కోలా ఉందని అన్నారు. అందుకే మనమంతా ఇండియా అనే పేరును ఉపయోగించడం మానేసి, అన్ని ఆచరణాత్మక రంగాలలో భారత్‌ని ఉపయోగించాలని, అప్పుడే మార్పు వస్తుందని ఆయన అన్నారు.

YS Sharmila: ఈ విషయంపైనే సోనియాతో మాట్లాడాను.. చర్చలు కొలిక్కివచ్చాయి: వివరాలు తెలిపిన షర్మిల

మనం మన దేశాన్ని భారతదేశం అని పిలవాలని, అలాగే ఇతరులకు కూడా వివరించాలని భగవత్ అన్నారు. ఐక్యత శక్తిని నొక్కిచెప్పిన ఆయన, భారతదేశం అందరినీ ఏకం చేసే దేశమని అన్నారు. నేడు ప్రపంచానికి మన అవసరం ఉందని, మనం లేకుండా ప్రపంచం నడవదని అన్నారు. యోగా ద్వారా ప్రపంచాన్ని అనుసంధానం చేశామని గుర్తు చేశారు. భారతీయ విద్యావ్యవస్థను బ్రిటిష్ వారు మార్చివేశారని ఆయన పేర్కొన్నారు. కొత్త విద్యా విధానం పిల్లల్లో దేశభక్తిని పెంచే ప్రయత్నం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ విలువలపై అవగాహన కల్పించాలని ఆయన కోరారు.

ట్రెండింగ్ వార్తలు