Russia Support India : ఐరాస భద్రతామండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వంపై రష్యా మద్దతు

భారత్ కు మరోసారి రష్యా బాసటగా నిలిచింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ ఎస్ సీ)లో భారత్ కు శాశ్వత సభ్యత్వంపై రష్యా మద్దతు ప్రకటించింది. ప్రాపంచిక, ప్రాంతీయ అంశాల పట్ల అనుసరిస్తున్న తీరుతో యూఎన్ ఎస్ సీకి భారత్ అదనపు వెలుగులు అద్దగలదని రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోస్ పేర్కొన్నారు.

Russia Support India : భారత్ కు మరోసారి రష్యా బాసటగా నిలిచింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ ఎస్ సీ)లో భారత్ కు శాశ్వత సభ్యత్వంపై రష్యా మద్దతు ప్రకటించింది. యూఎన్ ఎస్ సీకి భారత్ అదనపు వెలుగులు అద్దగలదని రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోస్ పేర్కొన్నారు. ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ముందంజలో ఉందన్నారు. భారత్ త్వరలో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించబోతుందని పేర్కొన్నారు. పలు సమస్యలను పరిష్కరించుకోవడంలో భారత్ అద్భుతమైన దౌత్యపర అనుభవం కలిగివుందన్నారు.

డిసెంబ్ 7న మాస్కోలో జరిగిన ప్రైమకోవ్ రీడింగ్స్ ఇంటర్నేషనల్ ఫోరమ్ లో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా లావ్రోస్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్య సమితిలో, షాంఘై సహకార సంఘంలో భారత్ క్రియాశీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబర్ లో ఐక్యరాజ్యసమితి 77వ సర్వ ప్రతినిధి సభలో కూడా లావ్రోస్ మాట్లాడుతూ భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వానికి భారత్ కు అన్ని అర్హతలున్నాయని తెలిపారు.

UNO: రష్యాకు వ్యతిరేకంగా ఐరాసా తీర్మానం.. మరోసారి ఓటింగ్‭కు డుమ్మా కొట్టిన భారత్

అలాగే, భారత్ తోపాటు బ్రెజిల్ కు కూడా శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని లావ్రోస్ సూచించారు.
భద్రతామండలిలో తీసుకురావాల్సిన మార్పులపై ప్రతిపాదనలపరంగా భారత్ ప్రముఖ పాత్ర పోషిస్తోందని వెల్లడించారు. భద్రతామండలిలో ఆసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల ప్రాతినిధ్యాన్ని విస్తరించడం అవసరమన్నారు. దీంతో మండలిలో ప్రజాస్వామ్యం వెల్లివిరుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ట్రెండింగ్ వార్తలు