UNO: రష్యాకు వ్యతిరేకంగా ఐరాసా తీర్మానం.. మరోసారి ఓటింగ్‭కు డుమ్మా కొట్టిన భారత్

ఓటింగ్‭కు దూరంగా ఉండడంపై ఐరాసకు భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ స్పందిస్తూ ‘‘దౌత్యపరమైన చర్చల ద్వారా శాంతి స్థాపనకు వేయాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఇరు దేశాలు దాడులను విరమించి, యుద్ధ పరిస్థితులను ముగించుకునేందుకు వీలైనంత త్వరగా శాంతి చర్చలను పునరుద్ధరిస్తారని మేం నమ్ముతున్నాం. యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో చేసే అన్ని మద్దతిచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉంది’’ అని అన్నారు.

UNO: రష్యాకు వ్యతిరేకంగా ఐరాసా తీర్మానం.. మరోసారి ఓటింగ్‭కు డుమ్మా కొట్టిన భారత్

India abstains from UNSC resolution against Russia

UNO: ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‭లోని నాలుగు ప్రాంతాలను ఆక్రమించుకోవడాన్ని వ్యతిరేకిస్తూ రష్యాపై ఐక్యరాజ్య సమితి ప్రవేశ పెట్టిన తీర్మానానికి ఓటేయకుండా భారత్ దూరంగా ఉంది. కొద్ది రోజుల క్రితం కూడా రష్యాకు వ్యతిరేకంగా పెట్టిన తీర్మానంపై ఓటింగ్‭కు దూరంగా భారత్ తటస్థ వైఖరి ప్రదర్శించింది. తాజాగా మరోసారి ఇదే వైఖరిని భారత్ ప్రదర్శించింది. భారత్‭తో పాటు చైనా, క్యూబా, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, థాయ్‭లాండ్, వియత్నాం దేశాలు కూడా ఓటింగ్‭కు దూరంగానే ఉన్నాయి.

ఉక్రెయిన్‭లోని లుహాన్స్క్, డొనెట్స్క్, ఖేర్సన్, జపోరిజియా అనే నాలుగు ప్రాంతాలను రష్యా విలీనం చేసుకున్నట్లు ఇటీవలే రష్యా ప్రకటించింది. అయితే ఈ విలీనం చట్టవ్యతిరేకమని పేర్కొంటూ అల్బానియా ఐరాసాలో తీర్మానాన్ని ప్రతిపాదించింది. దీనికి అనుగుణంగా ఐక్య రాజ్య సమితిలో బుధవారం ఓటింగ్ చేపట్టగా 143 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. భారత్ సహా 35 దేశాలు ఓటింగ్‭కు దూరంగా ఉన్నాయి. అత్యధిక దేశాలు మద్దతు ఇవ్వడంతో ఐక్య రాజ్య సమితి ఈ తీర్మానాన్ని ఆమోదించింది.

ఓటింగ్‭కు దూరంగా ఉండడంపై ఐరాసకు భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ స్పందిస్తూ ‘‘దౌత్యపరమైన చర్చల ద్వారా శాంతి స్థాపనకు వేయాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఇరు దేశాలు దాడులను విరమించి, యుద్ధ పరిస్థితులను ముగించుకునేందుకు వీలైనంత త్వరగా శాంతి చర్చలను పునరుద్ధరిస్తారని మేం నమ్ముతున్నాం. యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో చేసే అన్ని మద్దతిచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉంది’’ అని అన్నారు.

Hijab Protest: హిజాబ్ వ్యతిరేక నిరసనల్లో తుపాకుల మోత