India And Russia : భారత్ కు రష్యా అధ్యక్షుడు, కీలక ఒప్పందాలపై సంతకాలు!

భారత్‌-రష్యా మధ్య 20సార్లు వార్షిక సదస్సులు జరిగాయి. ప్రస్తుతం జరగనున్నది 21వది. సాధారణంగా ఈ వార్షిక సదస్సు ఒకసారి రష్యాలో జరిగితే మరోసారి భారత్‌లో జరగడం ఆనవాయితీగా వస్తోంది...

Russian President Putin : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2021, డిసెంబర్ 06వ తేదీ సోమవారం భారత్‌కు రానున్నారు. ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. చిరకాల మిత్రదేశం రష్యా.. భారత్‌ మధ్య కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం మరింత బలపడేలా భేటీ జరుగనుంది. మోదీ-పుతిన్‌లు సోమవారం సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఉభయ దేశాల మధ్య 10 కీలక ఒప్పందాలపై సంతకాలు పెట్టే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. రక్షణ, పర్యావరణ మార్పులు, వాణిజ్యం సహా ఇతర రంగాలకు చెందిన 10 ఒప్పందాలపై సంతకాలు పెట్టనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇరు దేశాల రక్షణ శాఖ, విదేశాంగ వ్యవహారాల మంత్రులు కూడా రేపు ముఖాముఖిగా సమావేశం కానున్నారు. ద్వైపాక్షిక సదస్సుతో పాటు ఉభయ దేశాల విదేశాంగ, రక్షణ మంత్రులు సమావేశం కానున్నారు.

Read More : Pakistani Couple : బోర్డర్ లో పాక్ మహిళ డెలివరీ, బిడ్డకు బోర్డర్ పేరు

భారత్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న క్షిపణి రక్షణ వ్యవస్థ S-400ను మరింత వేగంగా అందించాలని భారత్ .. రష్యాను కోరే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటు రక్షణ రంగంలో పెట్టుబడులు, ఆయుధాల కొనుగోలులో చర్చలు జరిగే అవకాశం ఉంది. రెండు దేశాల మధ్య రక్షణ రంగంలో చిరకాల సంబంధాలు ఉన్నాయి. వీటిని మరింత పెంచుకోనున్నారు. ఇందులో భాగంగానే అమేఠీ సమీపంలోని కోర్వాలో 5 వేల కోట్ల రూపాయలతో సంయుక్తంగా నెలకొల్పిన ఫ్యాక్టరీలో 5లక్షల ఏకే-230 రైఫిళ్ల తయారీకి కేంద్రం అనుమతి ఇచ్చింది. సైన్యం కోసం రెండు ఇంజిన్ల 226T హెలికాప్టర్లను సంయుక్తంగా తయారు చేయాలని కూడా నిర్ణయించనున్నారు. మోదీతో భేటీ తర్వాత మంగళవారం రాత్రి 9 గంటల 30 నిమిషాలకు పుతిన్‌ రష్యాకు తిరుగు పయనమవుతారు. ఇక పుతిన్‌ గౌరవార్థం మోదీ విందు ఇవ్వనున్నారు. భారత్‌-రష్యా మధ్య ఇప్పటికే 20సార్లు వార్షిక సదస్సులు జరిగాయి. ప్రస్తుతం జరగనున్నది 21వది. సాధారణంగా ఈ వార్షిక సదస్సు ఒకసారి రష్యాలో జరిగితే మరోసారి భారత్‌లో జరగడం ఆనవాయితీగా వస్తోంది. గతేడాది భారత్‌లో జరగాల్సిన ఈ సదస్సు.. కరోనా కారణంగా వాయిదా పడింది.

ట్రెండింగ్ వార్తలు