Sabarimala Ayyappa: తెరుచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయం.. రోజుకు 30వేల మందికి అనుమతి

భక్తుల సందర్శనార్థం శబరిమల అయ్యప్ప ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. సోమవారం నవంబర్ 15న గర్భగుడిని ప్రధాన అర్చకులు తెరిచి పూజలు నిర్వహించారు.

Sabarimala Ayyappa:  భక్తుల సందర్శనార్థం శబరిమల అయ్యప్ప ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. సోమవారం నవంబర్ 15న గర్భగుడిని ప్రధాన అర్చకులు తెరిచి పూజలు నిర్వహించారు. భక్తుల సందర్శించేందుకు రేపటి నుంచి అనుమతి ఉంటుందని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు.

దీక్ష పూని స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం రెండు నెలల పాటు ఆలయం తెరిచే ఉంటుందని అన్నారు. మండల మకరవిళక్కు పండగ సీజన్ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రోజుకు 30 వేల మంది భక్తులను మాత్రమే అనుమతించాలని అధికారులు ఆదేశించారు.

శబరిమల ఆలయ దర్శనానికి వచ్చే వారు కచ్చితంగా వ్యాక్సిన్ సర్టిఫికేట్ లేదా కరోనా టెస్ట్ (ఆర్టీపీసీఆర్) నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు.

…………………………………………… : భార్య దొంగతనాలు చేస్తుంటే..భర్త బాడీగార్డ్

ట్రెండింగ్ వార్తలు