Infosys
Infosys : ఇన్ఫోసిస్ తన సంస్థలో పని చేసే ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. శాలరీలు హైక్ చేసినట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది. సగటున 5 శాతం నుంచి 8 శాతం, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి 20 శాతం మేర వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు లేఖలు జారీ చేసింది.
శాలరీ హైక్ కి సంబంధించి ఉద్యోగులను మూడు విభాగాలుగా వర్గీకరించింది ఇన్ఫోసిస్. అంచనాలు అందుకున్న ఉద్యోగులకు 5 నుంచి 7 శాతం, అంచనాలకు మించి కనబరిచిన వారికి 7 నుంచి 10 శాతం, అత్యుతమ ప్రతిభ కనబరిచిన వారికి 10 నుంచి 20 శాతం వేతన పెంపును అందించినట్లుగా సమాచారం.
Also Read : బంగారం మరో నాలుగు నెలల తర్వాత అక్కడ తగ్గుతుందా? 50 ఏళ్ల నుంచి ట్రెండ్ ఇలాగే ఉంది మరి..
పనితీరు ఆధారంగా ఉద్యోగులకు జీతాలు పెంచుతున్నట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది. చాలా మంది ఉద్యోగులు 5 నుంచి 8శాతం మధ్య పెరుగుదలను పొందారు. అత్యుత్తమ ప్రదర్శన చూపిన వారికి అధిక వేతనాలు లభించాయి. దిగువ స్థాయి ఉద్యోగులకు జనవరి 1, 2024 నుండి.. మేనేజర్లకు ఏప్రిల్ 1, 2024 నుండి వేతన సవరణలు వర్తిస్తాయి.
కంపెనీ తన ఉద్యోగులను మూడు కేటగిరీలుగా వర్గీకరించింది. అంచనాలను అందుకున్న వారికి 5-7% జీతం పెరుగుదల లభించింది. అంచనాలను మించి పనితీరు చూపిన ఉద్యోగులు 7-10% పెంపును పొందారు. అత్యుత్తమ ప్రదర్శన చూపిన ఉద్యోగులు 10-20% వరకు ఇంక్రిమెంట్ చూశారు.
జీతాలు పెరిగినా కొందరు ఉద్యోగులు పెద్దగా హ్యాపీగా లేరు. ఎందుకంటే గతంతో పోలిస్తే.. ఈసారి వేతనాలు పెద్దగా పెంచింది లేదంటున్నారు. క్రితంతో పోలిస్తే ఈసారి వేతనాల పెంపు అంత ఎక్కువగా లేదంటున్నారు. చాలా మంది ఉద్యోగులు భారీగా జీతాలు పెరుగుతాయని ఆశించారు. కానీ అలా జరక్కపోవడంతో కొంత నిరుత్సాహానికి గురయ్యారు. కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో ఐటీ రంగం ఒడిదొడుకులను ఎదుర్కోంటోంది. ఇలాంటి సిచువేషన్ లో ఇంతకన్నా ఎక్కువ శాలరీ హైక్ ఆశించలేము అంటున్నారు.