Ashok Chandna - Chandrayaan (Photo : Google)
Ashok Chandna – Chandrayaan : చంద్రయాన్ -3 ప్రయోగం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. యావత్ దేశం గర్వంతో ఉప్పొంగింది. ఇస్రో సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచంలో ఇప్పటివరకు ఏ దేశానికి సాధ్యం కాని ఘన విజయాన్ని భారత్ నమోదు చేసింది. చంద్రుడి దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండర్ కాలు మోపి మీసం మెలేసింది. జాబిల్లిని చంద్రయాన్-3 ముద్దాడి అంతరిక్షంలో భారత ప్రతిష్టను చాటి చెప్పింది.
చంద్రయాన్-3 విజయవంతం కావడంతో ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది. ఇక, ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో ప్రముఖులు.. ఇస్రో సైంటిస్టులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. జయహో భారత్, జయహో ఇస్రో అని కీర్తిస్తున్నారు. ప్రధాని మోదీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు ఇస్రోకి కంగ్రాట్స్ చెప్పారు.
చంద్రయాన్ -3 సక్సెస్ పై రాజస్థాన్ యూత్ అఫైర్స్, స్పోర్ట్స్ మినిస్టర్ అశోక్ చందన కూడా స్పందించారు. అయితే, ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మంత్రి గారికున్న నాల్డెజ్ కు నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. పిచ్చ కామెడీ అంటూ మంత్రిని ఓ ఆటాడుకుంటున్నారు. నువ్వు దేవుడు సామీ అని దెప్పిపొడుస్తున్నారు. మీకున్న అపారమైన జ్ఞానానికి హ్యాట్సాఫ్ అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇంతకీ మంత్రిగారు ఏమన్నారో తెలుసా..
Also Read..Chandrayaan 3: చంద్రయాన్-3 గురించి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసా?
”చంద్రయాన్ -3 సక్సెస్ కావడం సంతోషంగా ఉంది. అందులో వెళ్లిన యాత్రికులకు సెల్యూట్ చేస్తున్నా. సైన్స్, స్పేస్ రీసెర్చ్ లో మన దేశం మరింత ముందుకు వెళ్లింది. భారతీయులందరికీ శుభాకాంక్షలు” అని అన్నారు. అంతే, మంత్రి గారి వ్యాఖ్యలతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. చంద్రయాన్ లో యాత్రికులు ఎక్కడి నుంచి వచ్చారబ్బా అని జట్టు పీక్కుంటున్నారు. బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు. అందులో యాత్రికులు వెళ్లడం ఏంటి సామీ అని నెత్తి బాదుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే మంత్రికి కనీస అవగాహన కూడా లేదని నెటిజన్లు తేల్చేశారు. ఇలాంటి వ్యక్తులు మంత్రులుగా ఉంటే, ఇక ఆ రాష్ట్రం బాగుపడినట్లే అని నిట్టూరుస్తున్నారు.
140 కోట్ల మంది భారతీయులతో పాటు యావత్ ప్రపంచం తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూసిన చంద్రయాన్-3 ప్రయోగం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఇస్రో అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఇప్పటివరకు ఎవరూ దిగని చంద్రుడి దక్షిణ ధృవంపై(సౌత్ పోల్) విక్రమ్ ల్యాండర్ కాలు మోపింది. దీంతో ప్రపంచ యవనికపై భారత పతాకం రెపరెపలాడింది. చంద్రయాన్ 3 సక్సెస్ కావడంతో భారతీయులంతా సంబరాలు చేసుకుంటున్నారు. జయహో భారత్ అని నినదిస్తున్నారు.
Congress leader and Rajasthan’s Sports Minister, Ashok Chandna-
“I salute the passengers who went in Chandrayaan”#Chandrayaan3 pic.twitter.com/alGuVkZVda
— Megh Updates ?™ (@MeghUpdates) August 23, 2023