Swami Prasad Maurya: రసవత్తరమైన ఓబీసీ మీటింగ్.. స్వామి ప్రసాద్ మౌర్యపై బూటు విసిరిన లాయర్, చితక్కొట్టిన సమాజ్‭వాదీ కార్యకర్తలు

స్వామి ప్రసాద్ మౌర్య 1996లో రాయ్‌బరేలీలోని దాల్మావు అసెంబ్లీ స్థానం నుంచి బీఎస్పీ టిక్కెట్‌పై పోటీ చేసి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆయన కెరీర్‌లో 4 సార్లు క్యాబినెట్ మంత్రి అయ్యారు. యూపీ శాసనసభలో మూడుసార్లు ప్రతిపక్ష నేతగా కూడా పనిచేశారు

Samajwadi Party: సమాజ్‌వాదీ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఓబీసీ సదస్సులో ఆ పార్టీ సీనియర్ నేత స్వామి ప్రసాద్ మౌర్యపై షూ విసిరారు. అనంతరం షూ విసిరిన వ్యక్తిని సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు విపరీతంగా కొట్టారు. అనంతరం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విభూతి ఖండ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, నెటిజెన్ల నుంచి భిన్న స్పందన వస్తోంది. ముఖ్యంగా ఎస్పీ కార్యకర్తల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

INDIA 3rd Meet: ముంబైలో జరిగే మూడో విపక్ష సమావేశానికి కేజ్రీవాల్ హాజరవుతున్నారా? ఆయన ఏమన్నారంటే?

దీనికి ముందే ఎస్పీ నుంచి బీజేపీలో చేరిన నేతపై ఇలాంటి దాడే జరిగింది. ఘోసీ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఆదివారం ప్రజా సంబంధాల సందర్భంగా అద్రి బజార్‌లో బీజేపీ అభ్యర్థి దారా సింగ్ చౌహాన్‌పై కొంతమంది నల్ల ఇంక్ చల్లారు. ఆయన ఇటీవలే ఎస్పీని వీడి బీజేపీలో చేరారు. ఇకపోతే.. స్వామి ప్రసాద్ మౌర్య యూపీ రాజకీయాల్లో పెరున్న వ్యక్తి. ఒకప్పుడు బీఎస్పీలో ఉన్న మౌర్య.. అనంతరం బీజేపీలో చేరి, ఆ తర్వాత బీజేపీకి టాటా చెప్పి అఖిలేష్ సైకిల్ ఎక్కారు. స్వామి ప్రసాద్ మౌర్య సుమారు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి. యూపీ రాజకీయాల్లో ఆయన బలీయమైన రాజకీయ నాయకుడని అంటారు.

స్వామి ప్రసాద్ మౌర్య 1996లో రాయ్‌బరేలీలోని దాల్మావు అసెంబ్లీ స్థానం నుంచి బీఎస్పీ టిక్కెట్‌పై పోటీ చేసి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆయన కెరీర్‌లో 4 సార్లు క్యాబినెట్ మంత్రి అయ్యారు. యూపీ శాసనసభలో మూడుసార్లు ప్రతిపక్ష నేతగా కూడా పనిచేశారు. 2009లో కేంద్ర మంత్రి ఆర్‌పిఎన్‌ సింగ్‌ తల్లిని పద్రౌనా నుంచి ఉప ఎన్నికలో ఓడించిన తర్వాత మాయావతికి సన్నిహితంగా మెలిగిన నేతల్లో ఆయన ఒకరు. 2008లో స్వామి ప్రసాద్ మౌర్యకు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది.

Telangana Elections 2023: ఏడుగురు ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వకుండా కేసీఆర్ ఇంత పెద్ద షాక్ ఎందుకు ఇచ్చారో తెలుసా? 

2012లో ఓటమి తర్వాత ఆ బాధ్యత నుంచి ఆయనను మాయావతి తొలగించారు. ఇక 2016లో స్వామి ప్రసాద్ మౌర్య బహుజన్ సమాజ్ పార్టీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. అనంతరం బీఎస్పీని విడిచిపెట్టి, తన సొంత పార్టీని స్థాపించారు. కానీ అంతలోనే పార్టీ బీజేపీలో కలిపారు. ఇక 2017లో స్వామి ప్రసాద్ మౌర్య అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంత్రి పదవిని పొందారు. అనంతరం బీజేపీకి గుడ్ బై చెప్పి సమాజ్ వాదీ పార్టీలో చేరారు.

ట్రెండింగ్ వార్తలు