Sangana Basava Swami : ప్రవచనాలు చెబుతూనే ప్రాణాలు వదిలిన పీఠాధిపతి

ప్రవచనాలు చెబుతూనే ఓ పీఠాధిపతి ప్రాణాలు వదిలారు. కర్నాటక రాష్ట్రం బెళగావి జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. బలోబల మఠం పీఠాధిపతి శ్రీసంగన బసవ మహా స్వామీజీ(54)

Sanganabasava Maha Swamiji

Sangana Basava Swami : ప్రవచనాలు చెబుతూనే ఓ పీఠాధిపతి ప్రాణాలు వదిలారు. కర్నాటక రాష్ట్రం బెళగావి జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. బలోబల మఠం పీఠాధిపతి శ్రీసంగన బసవ మహా స్వామీజీ(54) ప్రసంగిస్తూనే స్టేజ్ పైనే ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 6న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తన పుట్టిన రోజు వేడుకల సందర్భంగా పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులను ఉద్దేశించి స్వామీజీ ప్రసంగిస్తున్నారు.

Read More..Amaravathi: అమరావతి.. రైతులకే కాదు.. ఏపీ ప్రజలందరికీ రాజధాని.. హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు

ఆ సమయంలో హఠాత్తుగా గుండెపోటు రాగా ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. కుర్చీలోనే కన్నుమూశారు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా షాక్ కి గురయ్యారు. ఏం జరిగిందో తెలుసుకునేలోపే పీఠాధిపతి కన్నుమూశారు. అందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

CBI : చైల్డ్ పోర్న్ రాకెట్‌పై సీబీఐ మెరుపు దాడి

స్వామిజీ ప్రవచనాలు చెబుతున్నారు. వేదిక మీద ఉన్న వారు, భక్తులు అంతా శ్రద్దగా వింటున్నారు. ప్రవచనాలు చెబుతున్న స్వామీజీ ఒక్కసారిగా కుర్చీలోనే కుప్పకూలారు. దీంతో అక్కడ అలజడి రేగింది. స్వామీజీకి ఏమైందో తెలియక అంతా కంగారుపడ్డారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే ఆయన చనిపోయారని డాక్టర్లు చెప్పారు. గుండెపోటుతో స్వామీజీ కన్నుమూశారని డాక్టర్లు తెలిపారు. తన పుట్టిన రోజు నాడే స్వామీజీ తుది శ్వాస విడిచారు. సంగనబసవ స్వామి బాలాబోల మఠానికి చెందిన వారు. బవసయోగ్ మండప్ ట్రస్ట్ పెద్దగా ఉన్నారు. నవంబర్ 6న ఆయన 53వ పుట్టిన రోజు. ఆ సందర్భంగా ప్రవచనాలు ఇస్తూ కన్నుమూశారు.