CBI : చైల్డ్ పోర్న్ రాకెట్‌పై సీబీఐ మెరుపు దాడి

ఆన్ లైన్ చైల్డ్ పోర్న్ రాకెట్ పై సీబీఐ పంజా విసిరింది. దేశ వ్యాప్తంగా 14 రాష్ట్రాల్లోని 76 ప్రాంతాల్లో ఏకకాలంలో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది.

CBI : చైల్డ్ పోర్న్ రాకెట్‌పై సీబీఐ మెరుపు దాడి

Cbi

CBI : ఆన్ లైన్ చైల్డ్ పోర్న్ రాకెట్ పై సీబీఐ పంజా విసిరింది. దేశ వ్యాప్తంగా 14 రాష్ట్రాల్లోని 76 ప్రాంతాల్లో ఏకకాలంలో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. చైల్డ్ పోర్న్ వీడియోస్ సర్క్యులేట్ చేస్తున్న 83 మంది అనుమానితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 14న 23 కేసులు నమోదు కావడంతో పరిస్థితిని అర్ధం చేసుకున్న సీబీఐ రంగంలోకి దిగింది.

చదవండి : Porn Addiction : శాడిస్ట్ భర్త…పోర్న్ సైట్లు చూస్తూ…

ఆంధ్రప్రదేశ్‌ తోపాటు ఢిల్లీ, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఒడిశా, త‌మిళ‌నాడు, రాజ‌స్థాన్‌, పంజాబ్, బీహార్, మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్, హ‌ర్యానా, ఛ‌త్తీస్‌గ‌ఢ్, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో త‌నిఖీలు కొన‌సాగుతున్నాయి. ఈ తనిఖీల్లో కొన్ని వీడియోలు సీబీఐ అధికారుల కంటపడటంతో వాటిని సీజ్ చేశారు.

చదవండి : Porn : షాకింగ్.. పోర్న్ వీడియోలకు అలవాటుపడ్డ 11ఏళ్ల బాలురు.. దానికి ఒప్పుకోలేదని బాలిక హత్య

చైల్డ్ పోర్న్ వీడియోలు చూసినా, సర్క్యులేట్ చేసిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేంద్రం అనేక సార్లు చెప్పింది. అయితే కొందరు కేంద్రం హెచ్చరికలను పెడచెవిన పెట్టి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. కఠిన శిక్షలు పడతాయని తెలిసినా తమ ప్రవర్తన మార్చుకోవడం లేదు. ఇక అరెస్టైన 83 మందిని కఠినంగా శిక్షించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.